హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భర్తలకోసం పోలీస్ భార్యల ఫైట్: రంగంలోకి బాస్, సఫలం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Dinesh Reddy
హైదరాబాద్: ఎపిఎస్పీలో చెలరేగిన అలజడిని చల్లార్చేందుకు స్వయంగా పోలీసు బాస్ రంగంలోకి దిగారు. పలు డిమండ్లతో హైదరాబాదులోని కొండాపూర్ 8వ బెటాలియన్ పోలీసు కుటుంబాలు రెండు రోజులుగా ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే. సోమవారం కూడా వారు ధర్నాకు దిగారు. దీంతో రాష్ట్ర డిజిపి దినేష్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. పోలీసు కుటుంబాలతో చర్చలు జరిపారు.

కానిస్టేబుల్స్ కుటుంబాలు పెట్టిన అన్ని డిమాండ్లకు డిజిపి ఓకే చెప్పారు. డిజిపి హామీతో వారు తమ ఆందోళనను విరమించారు. పోలీసు కుటుంబాల న్యాయమైన డిమాండ్లన్నింటినీ తాము తీరుస్తామని చెప్పారు. త్వరలో వీటిపై ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. ఆందోళనలో పాల్గొన్న ఎవరి పైనా క్రమశిక్షణా చర్యలు తీసుకునే ఉద్దేశ్యం లేదన్నారు. ఇక నుండి ప్రతి నెల పోలీసుల కుటుంబ సభ్యులతో భేటీ నిర్వహిస్తామని చెప్పారు.

దూర ప్రాంతాలలో పని చేస్తున్న వారిని వెనక్కి పంపిస్తామన్నరు. మరోసారి దూర ప్రాంతాలకు పంపకుండా, ఎక్కువ రోజులు అక్కడే ఉండకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానిస్టేబుళ్లపై వేధింపులు లేకుండా చూస్తామని, ఆర్డర్లీ విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తామని చెప్పారు. ఎబిసి గ్రూపులు రద్దు చేస్తామని, సెలవులు అవసరమైనప్పుడు ఇస్తామని చెప్పారు. కానిస్టేబుళ్లకు, వారి కుటుంబాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు.

డిజిపి హామీలన్నింటికీ ఒప్పుకోవడంపై పోలీసు కుటుంబాలు హర్షం వ్యక్తం చేశాయి. కాగా కొండాపూర్ బెటాలియన్ ఆర్ఐ వినోద్ పైన శాఖ వేటు వేసింది. పోలీసు కుటుంబాలు బాస్ ముందు పెట్టిన డిమాండ్లు... ఆర్డర్లీ విధానం రద్దు, ఎబిసి గ్రూప్ విధానం రద్దు, తమిళనాడు తరహా రూల్స్‌కు అమలు, నెలకు మూడు రోజుల సెలవులు, 8 ఏళ్లు దాటిన వారికి ఉన్నతోద్యోగాలలో ప్రాధాన్యత, 100 కిలోమీటర్ల లోపు డ్యూటీ వేయడం. వీటన్నింటికి పోలీస్ బాస్ దినేష్ రెడ్డి సరే అనడంతో వారు తమ ఆందోళన విరమించారు.

English summary
APSP cops families withdrawn their agitation after DGP Dinesh Reddy's promise on police duties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X