వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మలేషియాలో తెలుగు తేజం: ధాతుక్ అవార్డు

By Pratap
|
Google Oneindia TeluguNews

Achaiah Kumar Rao
కౌలాలంపూర్: మలేషియా తెలుగు సంఘం అధ్యక్షుడు డాక్టర్ అచ్చయ్య కుమార్ రావును ఆ దేశం ప్రతిష్టాత్మకమైన ధాతుక్ అవార్డుతో సత్కరించింది. మలేషియా రాజు అబ్దుల్ హలీంషా తన 84వ జన్మదినోత్సవం సందర్భంగా అచ్యయ్య కుమార్ రావుకు ఆ అవార్డును ప్రదానం చేసారు. ఇది మలేషియా దేశం ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు.

మలేషియా జాతీయుడైన డాక్టర్ అచ్చయ కుమార్ రావు మలేషియా తెలుగు సంఘం అధ్యక్షుడిగా 2006లో ఎన్నికయ్యారు. గత ఆరేళ్లుగా మలేషియాలో నివసిస్తున్న తెలుగువారిని ఆయన సంఘటిత పరిచి, వారిలో తెలుగు భాషా సంస్కృతుల పట్ల అవగాహనను, చైతన్యాన్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నారు.

డాక్టర్ అచ్చయ్య కుమార్ రావు 1961 డిసెంబర్ 27వ తేదీన మలేషియాలోని తెలుగు కుటుంబంలో జన్మించారు. ఆయన వృత్తిరీత్యా వైద్యుడు. స్త్రీ సంబంధం వ్యాధుల నిపుణుడిగా పేరు గడించారు.

డాక్టర్ అచ్చయ్య కుమార్ నిరుపమాన సేవలకు గుర్తింపుగా లభించిన మలేషియా ప్రభుత్వ ప్రతిష్టాత్మకమైన అవార్డు ధాతుక్ లభించడం పట్ల మలేషియాలోని ఐదు లక్షల మంది తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని, రాష్ట్రంలోని తెలుగు ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

English summary
Malaysia Telugu Association president Achaiah Kumar Rao has been felicitated by Malaysia king Abdul HaleemshaW with prestigious Dhathuk award. Achaiah Kumar Rao is serving the Telugu people in Malaysia.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X