వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనురాధ బాలి 'ఫిజా' మృతి: ఆత్మహత్యా, హత్యా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Fiza
చండీఘర్: హర్యానా మాజీ ముఖ్యమంత్రి చందర్ మోహన్ రెండో భార్య అనురాధ బాలి అలియాస్ ఫిజా మృతి చుట్టూ మీస్టరీ అల్లుకుంటోంది. కుళ్లిపోయిన దశలో ఆమె శవం మొహాలిలోని ఆమె నివాసంలో కనిపించిన విషయం తెలిసిందే. ఆమె మృతిపై పోలీసులు హత్య కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె శవానికి వైద్యులు సోమవారం రాత్రి పోస్టుమార్టం నిర్వహించారు.

ఫిజా దేహంపై బయట ఏ మాత్రం గాయాలు కనిపించ లేదని సమాచారం. పోస్టుమార్టం నివేదికను పరిశీలించిన తర్వాతనే ఏ విషయమూ తెలుస్తుందని అంటున్నారు. ఇంటి తలుపు మూసి లేకపోవడాన్ని బట్టి ఏదైనా జరిగి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. గదిలో మద్యం సీసాలు, సిగరెట్లు, కొన్ని ఆహారపదార్థాలు కనిపించాయి. ఫోన్ రికార్డులను పరిశీలిస్తే చివరి కాల్ ఆగస్టు 1వ తేదీ సాయంత్రం 6 గంటల 12 నిమిషాలకు వచ్చినట్లు తెలుస్తోంది.

దర్యాప్తు అధికారులు మె పూర్తి కాల్ వివరాలు తెప్పించుకుంటున్నారు. వాటిని పరిశీలిస్తే చివరి రోజుల్లో ఆమె ఎవరితో ఎక్కువగా మాట్లాడిందనే విషయం తెలుస్తుందని అంటున్నారు. ఆమె మిత్రులను ఇద్దరిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ప్రతి శనివారం చండిఘర్‌లో డిస్కోథెక్ పోయే అలవాటు ఫిజాకు ఉంది. ఈ శనివారం మాత్రం ఆమె వెళ్లలేదు. దాంతో పబ్ సిసిటీవీ కెమెరాలను దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు. ఆమె స్నేహితులు వెళ్లారా, లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి వాటిని పరిశీలిస్తున్నారు.

ఫిజా 2009 జనవరి 30వ తేదీన ఓసారి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. అయితే, తృటిలో తప్పించుకుంది. 2008లో ఆమెను చందర్ మోహన్ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 2009లో వదిలేసి మొదటి భార్య వద్దకు వెళ్లిపోయారు. మొదటి భార్యకు ఇద్దరు కుమారులున్నారు. తలాఖ్ అంటూ మూడుసార్లు ఎస్ఎంఎస్ మెసేజ్‌ను ఫిజాకు పంపేసి చందర్ మోహన్ తప్పుకున్నారు. భజన్ లాల్ కుటుంబం తనను వేధిస్తోందంటూ ఫిజా పలుసార్లు ఫిర్యాదు చేసింది. చందర్ మోహన్ వదిలేసినప్పటి నుంచి ఆమె ఒంటరిగానే ఉంటూ వచ్చింది.

English summary
Mystery continues to surround the death Anuradha Bali alias Fiza, whose decomposed body was found in her house in Mohali. The police are close to considering her death as a murder case, reports said on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X