వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జెడి కాల్ డేటా లీక్: పరారీలో కెవిపి వియ్యంకుడు

By Pratap
|
Google Oneindia TeluguNews

CBI JD Laxmi Narayana
హైదరాబాద్: సిబిఐ జాయింట్ డైరెక్టర్ (జెడి) లక్ష్మీనారాయణ కాల్‌ రికార్డు డేటా లీక్ కేసులో నిందితుడు, వ్యాపారవేత్త, కెవిపి రామచంద్రరావు వియ్యంకుడైన రఘురామ కృష్ణంరాజు పరారీలో ఉన్నట్లు సీఐడీ అధికారి ఒకరు తెలిపినట్లు బుధవారం వార్తలు వచ్చాయి. ఆయన కోసం సిఐడి పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఎమ్మార్ అక్రమాలపై దర్యాప్తు చేస్తున్న సిబిఐ జేడీని ఎలాగైనా ఇరుకున పడేయాలని ఓ గ్యాంగ్ ఆయన కాల్‌డేటాను సేకరించాలని ప్రయత్నించింది.

మీడియా కథనాల ప్రకారం - దాంట్లో భాగంగా రఘురామరాజు ఎంవీ రావు అనే వ్యాపారవేత్తను రంగంలోకి దింపారు. ఆయన తనకు తెలిసిన బీఎస్ఎన్ఎల్ అధికారి హనుమంతు ద్వారా జేడీ కాల్ డేటాను సేకరించారు. అయితే విషయం బయటకు పొక్కడంతో లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన రఘురామరాజు మహారాష్ట్రలోని తన కంపెనీ ఇంద్ భారత్ ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఉపాధ్యక్షుడైన కె. వెంకారెడ్డి ద్వారా తప్పు కప్పిపుచ్చుకోడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

అక్కడి మరాఠా మహిళతో జెడి నెంబర్‌తో బెదిరింపులు వస్తున్నాయంటూ నాందేడ్‌లోని మఖద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే.. వెంకారెడ్డిని సీఐడీ పోలీసులు అరెస్టు చేసి కస్టడీకి తీసుకొని ప్రశ్నించారు. కాల్‌డేటా సేకరణలో తెరవెనుక వ్యవహారం నడిపింది రఘురామరాజేనని తేలింది. దీంతో ఆయనను అరెస్టు చేసేందుకు సిఐడి సిద్ధపడింది.

విషయం తెలుసుకున్న ఆయన కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. అరెస్టు చేద్దామని ప్రయత్నిస్తున్న సీఐడీ అధికారులకు ఆయన ఆచూకీ లభించలేదు. సెల్ నెంబర్‌కు ఫోన్‌చేస్తే స్విచాఫ్ అన్న మాటే వినిపిస్తోందని అంటున్నారు.

English summary
According to media reports - Congress Rajyasabha member KVP Ramachandar Rao's relative Raghu ramaraju is absconding in CBI JD Lakshminarayana's call record data leak case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X