హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సత్యం కేసు: 120 కోట్ల ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ఓకే

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ramalinga Raju
హైదరాబాద్: సత్యం కేసులో రామలింగ రాజుకు చెందిన రూ.120 కోట్ల విలువైన ఆస్తుల అటాచ్‌మెంటుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిసేషన్(సిబిఐ)కి కోర్టు బుధవారం అనుమతిని ఇచ్చింది. రామలింగ రాజు ఆస్తుల కేసు తుది దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆయన ఆస్తుల అటాచ్‌మెంటుకు అనుమతివ్వాలని సిబిఐ ఇటీవల సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు ఇరువైపుల వాదనల అనంతరం సిబిఐకి అటాచ్‌మెంట్ కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సత్యం రామలింగ రాజుతో పాటు ఆయన కుటుంబ సభ్యుల పైన 1063 ఆస్తులు ఉన్నట్లుగా తెలుస్తోంది. వీటన్నింటి అటాచ్‌మెంట్‌కు కోర్టు సిబిఐకి అనుమతించింది.

ఆంధ్ర ప్రదేశ్‌తో పాటు కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్రలలో సత్యం రామలింగరాజు, ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఆస్తులు ఉన్నట్లుగా సిబిఐ గుర్తించింది. అటాచ్‌మెంట్‌కు కోర్టు అనుమతివ్వడంతో ఇక తదుపరి కార్యాచరణకు సిబిఐ సిద్ధమవుతోంది.

కాగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్న సత్యం కంప్యూటర్స్ కంపెనీ ప్రమోటర్ల కుటుంబ ఆస్తుల జప్తునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. రంగారెడ్డి, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో ఈ ప్రమోటర్లకు చెందిన ఆస్తుల విలువ 2.48 కోట్ల రూపాయల మేర ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం 44 రకాల ఆస్తుల జప్తునకు అనుమతి ఇస్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గతంలో ఫైల్‌పై సంతకం చేశారు. సత్యం కంప్యూటర్స్ అధినేతగా రామలింగ రాజు ఉన్నప్పుడు భారీ కుంభకోణం జరిగింది.

సత్యం ప్రమోటర్ల కుటుంబ ఆస్తుల జప్తునకు ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది. ఈ ఆస్తుల జప్తునకు సిబిఐ రేపు (శుక్రవారం) సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఇంతకు ముందు ఇదే వ్యక్తులకు చెందిన మూడు కోట్ల 87 లక్షల రూపాయల ఆస్తుల స్వాధీనానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సత్యం కంప్యూటర్స్ కంపెనీ ప్రమోటర్లు, వారి కుటుంబ సభ్యులకు చెందిన ఏడు కీలకమైన కంపెనీల పేర్ల మీద 44 రకాల ఆస్తులు రిజిష్టరై ఉన్నట్లు తెలుస్తోంది.

English summary
City Civil Court gave green signal to CBI to attach Ramalinga Raju properties in Satyam scam case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X