వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆడా మగా: నిత్యానంద లింగనిర్ధారణ టెస్ట్స్‌పై హైకోర్టు స్టే

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nithyananda Swamy
బెంగళూరు: రాసలీలల స్వామి నిత్యానందకు లింగ నిర్ధారణ పరీక్షలు జరిపే విషయమై కర్నాటక రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. తనకు లింగ నిర్ధారణ పరీక్షలు జరపాలని బెంగళూరు రామనగర్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ నిత్యానంద ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు పరీక్షలపై తాత్కాలికంగా స్టే విధించింది. ఈ నెల 20వ తేది వరకు లింగ నిర్ధారణ పరీక్షలు జరపవద్దని ఆదేశించింది.

తాను మగాడిని కానని నిత్యానంద గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. సినీ నటి రంజితతో రాసలీలల కేసుతో పాటు పలు కేసులలో ఇరుక్కున్న నిత్యానందకు లింగ నిర్ధారణ పరీక్షలు జరపేందుకు అనుమతించాలని సిఐడి పోలీసులు గతంలో బెంగళూరులోని రామనగర కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ స్వీకరించిన కోర్టు ఇరువైపుల వాదనలు విన్న అనంతరం నిత్యానందకు లింగ నిర్దారణ పరీక్షలు చేయాలని, అతను మగాడా లేక స్త్రీయా తేల్చాలని తీర్పు చెప్పింది.

మరోవైపు మధురై ఆధీనం మఠం పీఠాధిపతిగా నిత్యానందనను తొలగించనున్నారని తెలుస్తోంది. ఇటీవల ఆయన మధురై ఆధీనం 293వ పీఠాధిపదిగా నియమితులైన విషయం తెలిసిందే. అనేక ఆరోపణలు, కేసులతో పాటు పలువురు నిత్యానంద నియామకంపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ఆయనను తొలగించే అవకాశముందని తెలుస్తోంది.

కాగా నిత్యానంద స్వామి నిత్యం ఏదో ఒక రకంగా మీడియాలో నానుతున్నారు. రంజితతో రాసలీలల వ్యవహారంతో బయటకొచ్చిన ఆయన ఆ తర్వాత పలు కేసులలో చిక్కుకోవడంతో పాటు ధార్మిక సంస్థల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. ఇటీవల అతనిపై అరెస్టు వారెంట్ జారీ కావడంతో నేపాల్ మీదుగా రంజితతో కలిసి విదేశాలకు చెక్కేసే ప్రయత్నాలు కూడా చేశారని వార్తలు వచ్చాయి.

English summary
The High Court of Karnataka on Tuesday stayed the potency test on self styled godman Nithyananda Swamy. The Ramanagaram district court had ordered the test. Nithyananda had approached the High Court challenging the order.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X