చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దేశ్‌ముఖ్ ఆరోగ్యం ఆందోళనకరమే: చెన్నైకి సిఎం

By Pratap
|
Google Oneindia TeluguNews

Vilasrao Deshmukh
ముంబై: కేంద్ర మంత్రి విలాసరావు దేశ్‌ముఖ్ ఆరోగ్య పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది. చెన్నైలోని గ్లోబల్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. దీంతో మహారాష్డ్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఆయనను పరామర్శించడానికి చెన్నై వెళ్లారు. కాలేయానికి సంబంధించిన వ్యాధికి ఆయన చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

విలాసరావు దేశ్‌ముఖ్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని, అబ్జర్వేషన్‌లోనే ఉంచామని గ్లోబల్ ఆస్పత్రి అధికారి ఒకరు చెప్పారు. కాగా, దేశ్‌ముఖ్ త్వరగా కోలుకోవాలని ఆయన సొంత పట్టణం లాతూరులో ప్రార్థనలు చేశారు విలాస్‌రావు ఏడాది క్రితం చేయించుకున్న హెల్త్ చెకప్‌లో వ్యాధి విషయం బయటడింది. దీంతో రెండుమూడుసార్లు ఆయన విదేశాలలో చికిత్స చేయించుకున్నారు. ముంబైలోని బీచ్ క్యాండీ ఆసుపత్రిలో కూడా విలాస్‌రావుకు మూడు రోజులు డయాలసిస్ చేశారు. అయినా పరిస్థితి మెరుగు కాకపోవడంతో ఆయనను చెన్నైలోని గ్లోబల్ ఆసుపత్రికి తరలించారు. విలాస్‌రావుకు కాలేయ మార్పిడికి కూడా ప్రయత్నాలు చేసినట్లు సమాచారం.

విలాస్‌రావు దేశ్‌ముఖ్ 26 మే 1945లో జన్మించారు. మొదటి నుండి కాంగ్రెసు పార్టీలోనే ఉన్నారు. ఆయనకు ముగ్గురు పిల్లలు. ప్రముఖ సినీ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ ఆయన తనయుడే. ఆయన మహారాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1999 నుండి 2003 వరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆ తర్వాత 2004 నుండి 2008 వరకు మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన ఈ రెండుసార్లు లాతూర్ నుండి గెలుపొందారు.

ఆ తర్వాత కేంద్రమంత్రివర్గంలోకి వెళ్లిపోయారు. విలాస్ రావు మన్మోహన్ సింగ్ మంత్రి వర్గంలో భారీ పరిశ్రమల శాఖను, పంచాయతీరాజ్ శాఖను, గ్రామీణాభివృద్ధి శాఖను, ఎర్త్ సైన్స్ శాఖను, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖను చేపట్టారు. ఇతను ముంబయి క్రికెట్ అసోసియేషన్ మెంబర్‌గా ఉన్నారు.

English summary
Maharashtra chief minister Prithviraj Chavan and deputy chief minister Ajit Pawar on Wednesday left for Chennai, where Union minister Vilasrao Deshmukh is "still critical" at a private hospital there, after being admitted for a liver-related ailment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X