హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబు ఎందుకు అరెస్టయ్యారో అర్థం కావట్లేదు: దానం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Danam Nagendar
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఫీజు రీయింబర్సుమెంట్సు పైన ధర్నా చేసి అరెస్టు కావడం విడ్డూరంగా ఉందని మంత్రి దానం నాగేందర్ గురువారం ఎద్దేవా చేశారు. బుధవారం చంద్రబాబు ఫీజులపై ధర్నా చేసి అరెస్టైన విషయం తెలిసిందే. దీనిపై దానం స్పందించారు. బాబు అరెస్టు ఎందుకయ్యారో ఇప్పటికీ తనకు అర్థం కావడం లేదన్నారు. బాబుకు తన హయాంలో బిసి విద్యార్థుల సమస్యలు కనిపించలేదా అని ప్రశ్నించారు. బాబు అధికారంలో ఉండగా ప్రజా సమస్యలు ఏవీ పట్టించుకోలేదన్నారు.

ఫీజ రీయింబర్సుమెంట్స్ అమలు చేయాలని ఉద్యమించిన విద్యార్థులపై కేసులు పెట్టడం సరికాదన్నారు. విద్యార్థులపై కేసుల ఎత్తివేత అంశాన్ని తాను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణతో మాట్లాడానని చెప్పారు. బిసి విద్యార్థులను ప్రభుత్వం ఆదుకోవాల్సిందే అన్నారు. ఈ పథకంలో కోత విధిస్తూ నిర్ణయం తీసుకునేది లేదని ఇప్పటికే బొత్స ప్రకటించారని చెప్పారు.

కొన్ని కళాశాలలు కేవలం ఫీజు రీయింబర్సుమెంట్సు కోసమే నడుస్తున్నాయని, అలాంటి వాటికి చెక్ చెప్పాల్సిన అవసరముందన్నారు. బాబు చవకబారు రాజకీయాలు మానుకోవాలని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. తన హయాంలో బాబు విద్యార్థుల చదవు కోసం ఫీజు రీయింబర్సుమెంట్సు పెట్టానని చెప్పడం విడ్డూరమన్నారు. ఆయన అధికారంలో ఉండగా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు.

చంద్రబాబును ప్రజలు ఇప్పుడు నమ్మే పరిస్థితి మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ వేరుగా అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు బాబు విద్యార్థులకు గానీ, బిసిలకు కానీ చేసిందేమీ లేదన్నారు. తనది కాదనుకుంటే బాబు ఎక్కడికైనా వెళ్లగలరని ఎద్దేవా చేశారు.

English summary
Minister Danam Nagendar questioned that Why Telugudesam Party chief Nara Chandrababu Naidu was arrested by police on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X