హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇంజనీరింగ్ కాలేజీలకు కళ్లెం: గవర్నర్ ఆర్డినెన్స్

By Pratap
|
Google Oneindia TeluguNews

Narasimhan
హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ నరసింహన్ గురువారంనాడు నూతన విద్యాచట్టం ఆర్డినెన్స్‌కు ఆమోద ముద్ర వేశారు. 1982 విద్యాచట్టం, 2008 సాంకేతిక విశ్వవిద్యాలయాల చట్ట సవరణ ఆర్డినెన్స్‌కు ఆయన ఆమోద ముద్ర వేశారు. ఈ ఆర్డినెన్స్ వల్ల ఇంజనీరింగ్, వృత్తి విద్యా కళాశాలలపై ప్రభుత్వ పర్యవేక్షణ పెరుగుతుంది. రాష్ట్రంలో కుప్పలు తెప్పలుగా వెలసిన ఇంజనీరింగ్ కళాశాలల దూకుడు కళ్లెం వేయడానికే ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌ను తెచ్చినట్లు తెలుస్తోంది.

తొమ్మిది నిపుణుల కమిటీ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా అంతకు ముందటి చట్టాన్ని సవరిస్తూ కొత్త చట్టాన్ని రూపొందించినట్లు సమాచారం. ఇంజనీరింగ్ కళాశాలలను కట్టడి చేసేందుకే ఈ చట్టాన్ని తెచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. పాత చట్టాల వల్ల వృత్తి విద్యా కశాశాలలపై ప్రభుత్వ నియంత్రణకు అంతగా అధికారాలు లేవు. నియంత్రణ కోసం ఈ ఆర్డినెన్స్‌ను తెచ్చారని అంటున్నారు.

రాష్ట్రంలోని పలు ఇంజనీరింగ్ కళాశాలల్లో తగిన మౌలిక వసతులు లేవని, అయినా ఫీజులు మాత్రం వసూలు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. పైగా, కాలేజీలు ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయి. విద్యార్థుల కొరతతో చాలా కాలేజీల్లో సీట్లు కూడా మిగిలిపోతున్నాయి. వృత్తి విద్యాసంస్థలను కట్టడి చేయాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించినట్లు చెబుతున్నారు.

ఫీజులు పెంపునకు ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. మెరిట్ కోటా సీట్లకు, యాజమాన్యం కోటా సీట్లకు వేర్వేరు ఫీజులు ఉండడాన్ని యాజమాన్యాలు వ్యతిరేకిస్తున్నాయి. మెరిట్ కోటా సీట్లకు కూడా ఫీజు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి.

English summary
Governor Narasimhan has signed on ordinance for new education law proposed by CM Kiran kumar Reddy's government. It is said that this was proposed to take controls over engineering colleges.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X