హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జెడి కాల్‌లిస్ట్‌లో కొత్త మలుపు: అప్పీల్ పిటిషన్ వాపస్

By Srinivas
|
Google Oneindia TeluguNews

CBI JD Laxmi Narayana
హైదరాబాద్: సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ కాల్ డేటా లీకేజీ వ్యవహారంలో హైకోర్టులో వేసిన తన పిటిషన్‌ను రఘురామ రాజు బుధవారం ఉపసంహరించుకున్నారు. దీనిపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రఘురామ రాజు ఇటీవల హైకోర్టులో అప్పీల్ చేశారు. లీకేజీ వ్యవహారంలో జెడి లక్ష్మీ నారాయణ ఫిర్యాదుతో హైదరాబాదు సిసిఎస్ పోలీసులు నమోదు చేసిన కేసులను కొట్టి వేయాలని అభ్యర్థిస్తూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై విచారించిన సింగిల్ జడ్జి భావు ఆ పిటిషన్‌ను కొట్టి వేశారు. దీన్ని సవాల్ చేస్తూ రఘురామ రాజు అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ తీర్పుపై మళ్లీ పిటిషన్ దాఖలు చేస్తానని, ఉపసంహరణకు అనుమతివ్వాలని అభ్యర్థించారు. దీన్ని పరిశీలించిన కోర్టు ఉపసంహరణకు అనుమతించింది. మరోవైపు జెడి కాల్‌లిస్టు కేసులో సిఐడి అధికారులు మరో అడుగు ముందుకేశారు. ఆ కాల్‌డేటా కోసం నాందేడ్ పోలీసులకు ఆయనపై తప్పుడు ఫిర్యాదు ఇవ్వాలని రఘురామ రాజు కంపెనీ వైస్ చైర్మన్ కెవి రెడ్డి నిర్ణయించారు.

అయితే పోలీసులకు అనుమానం రాకుండా మహారాష్ట్రకు చెందిన ఓ మహిళతో జనవరి 16న నాందేడ్‌లోని మఖద్ పోలీసులకు ఫిర్యాదు అందజేశారు. కెవి రెడ్డిని కస్టడీకి తీసుకున్న అధికారులు ప్రశ్నించినప్పుడు ఆమె స్వస్థలం నాందేడ్ అని, పేరు సవిత అని, ఇంద్ భారత్ కంపెనీ సమీపాన ఉంటారని వివరించారు. దీంతో సిఐడి అధికారులు అక్కడికి వెళ్లి వాకబు చేయగా కెవి రెడ్డి మరాఠీ భాషలో రాయమంటే రాసి ఇచ్చానని తప్ప కుట్రతో తనకెలాంటి సంబంధం లేదని ఆమె చెప్పారు. దీంతో సవితతో మరోసారి లేఖ రాయించి, మునుపటిదానితో పోల్చిచూడటం కోసం హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ సైన్స్ లేబ్‌కు పంపారు.

అయితే తనకు కాల్‌డేటా వివరాలేవీ అందలేదని, గతంలో సేకరించిన డేటా ఆధారం కోసమే తనతో ఫిర్యాదు చేయించారని కెవిరెడ్డి వెల్లడించినట్లు సమాచారం. మరోవైపు.. సామాజిక కార్యకర్త వాసిరెడ్డి చంద్రబాల కాల్‌డేటా కోసం నిందితులు అంతర్రాష్ట్ర దొంగల ముఠా నంబర్లతో ఆమె నంబర్‌ను కలిపి నాచారం సిఐ శ్రీనివాస రావు, దాన్ని సర్వీస్ ప్రొవైడర్‌కు పంపారు. ఈ విషయాలను సిఐడి కోర్టుకు వివరించింది. శ్రీనివాసరావు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై వాదనల సందర్భంగా సిఐడి న్యాయవాది ఈ మేరకు కోర్టు దృష్టికి తెచ్చారు.

English summary
Raghurama Krishnam Raju withdrew his petition on CBI JD Laxmi Narayana call list data from High Court of Andhra Pradesh on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X