హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రి వేధిస్తున్నారు: ఇస్కాన్ హరికృష్ణ, దానంపై కేసు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: మంత్రి దానం నాగేందర్ తమను కొంతకాలంగా వేధిస్తున్నారని ఇస్కాన్ ప్రధాన పూజారి హరికృష్ణ గురువారం అన్నారు. బంజారాహిల్స్‌లోని రోడ్డు నెంబర్ 12లోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వద్ద దానం నాగేందర్ హంగామా సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై ఇస్కాన్ ప్రతినిధి హరికృష్ణ స్పందించారు. మంత్రి దానం ఎందుకు అలా ప్రవర్తించారో తమకు అర్థం కావడం లేదన్నారు.

తొలుత ఆయన తమతో బాగానే ఉండేవారని, ఇప్పుడే ఇలా అంటున్నారన్నారు. తులసి కోట, జనరేటర్‌లను ఆయన అనుచరులు ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఘర్షణలను రేకెత్తించే ఉద్దేశ్యంతోనే వారు ఇలా చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. కొద్ది రోజులుగా తమను టార్గెట్‌గా చేసుకున్నారన్నారు. మంత్రి అయి ఉండి ఇలా ప్రవర్తిస్తే ఎలా అని వారు ప్రశ్నించారు.

ఆలయ అభివృద్ధికే తాము దీనిని ప్రభుత్వం నుండి లీజుకు తీసుకున్నామని చెప్పారు. శుక్రవారం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఉన్నాయని, ఇప్పుడు వచ్చి ఇలా ప్రవర్తించడం అనుమానంగా ఉందన్నారు. ఎవరు అడ్డు వచ్చినా తాము రేపటి కృష్ణాష్టమి వేడుకలను నిర్వహిస్తామని వారు చెప్పారు.

మరోవైపు ఆలయానికి గేటు వేసి రూల్స్ బ్రేక్ చేస్తామని పోలీసులను దుర్భాషాలాడిన మంత్రి దానం నాగేందర్ పైన పోలీసు కేసు నమోదయింది. స్థానిక ఎస్ఐని దానం దుర్భాషాలాడారు. దీంతో ఎస్ఐ పిర్యాదు చేయడంతో బంజారాహిల్స్ పోలీసులు దానం పైన కేసు నమోదు చేసుకున్నారు.

English summary
Iscon priest Harikrishna blamed minister Danam Nagendar for his allegations. Harikrishna said that Danam is targetting ISCON since some days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X