వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

30 ఏళ్ల లోపు యువతులు గల్ఫ్‌కు నో: వేధింపులవల్లే

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nepal Map
ఖాట్మాండ్: ముప్పయ్యేళ్ల లోపు యువతులు గల్ఫ్ దేశాలకు వెళ్లకూడదని మన పొరుగు దేశం నేపాల్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఉపాధి కోసం 30 ఏళ్లలోపు యువతులు గల్ఫ్ దేశాలకు వెళ్లకూడాదని ప్రభుత్వం తెలిపింది. గల్ఫ్‌లో ఉపాధి కోసం వెళ్లిన యువతులను లైంగికంగా వేధించడం, హింసించడం వంటి సంఘటనలు పెచ్చుపెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొన్నామని సమాచారశాఖ మంత్రి రాజ్‌ కిశోర్ యాదవ్ చెప్పారు.

గల్ఫ్‌కు వలస వెళ్లే యువతులకు వయోపరిమితిని విధించినట్టు ఆయన తెలిపారని ఓ ఆంగ్ల పత్రిక పేర్కొంది. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం దాదాపు 25 ఏళ్ల వయసులోని 2.44 లక్షల మంది నేపాలీ యువతులు గల్ఫ్‌లో.. వివిధ పనుల్లో కుదురుకొన్నారు. శ్రీలంక, ఫిలిప్పైన్స్, నేపాల్ తదితర ఆసియా దేశాల యువతులను గల్ఫ్‌లో ఆయా యజమానులు వేధిస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

అయితే, 30ఏళ్లలోపు యువతులు గల్ఫ్‌లో పని చేయరాదని నిషేధం విధించింది మాత్రం ఒక్క నేపాల్ రాజ్యమే. 2010లో లెబనాన్‌లో 15మంది నేపాల్ యువతులు ఆత్మహత్య చేసుకొన్నారు. ఖతార్, సౌదీ అరేబియా, కువైట్ తదితర దేశాల్లో.. ఇళ్లల్లో పని చేసే వాళ్లు, ఇతరులు.. తమ యజమానుల హింసను తట్టుకోలేక పోతున్నారు. దీంతో వారు నేపాల్ రాయాబార కార్యాలయాల్లో శరణార్థులుగా ఉంటున్నారు.

English summary
Nepal has banned women under the age of 30 from working in Persian Gulf nations amid increasing concerns over abuse and exploitation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X