• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గీతిక ఆత్మహత్య: కందా ముందస్తు బెయిల్‌ దరఖాస్తు

By Pratap
|

Goyal Kanda
న్యూఢిల్లీ: ఎయిర్ హోస్టెస్ గీతకా శర్మ ఆత్మహత్య కేసులో హర్యానా మాజీ మంత్రి గోపాల్ గోయల్ కందా ఢిల్లీ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. కింది కోర్టు నాలుగు రోజుల క్రితం ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఆరోపణలు తీవ్రమైనవనీ, విచారణకు విఘాతం కలగవచ్చునని అభిప్రాయపడుతూ కింది కోర్టు కందా ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. మేూత పడిన ఎండిఎల్ఆర్ ఎయిర్‌లైన్స్‌లో గీతికా శర్మ ఎయిర్ హోస్టెస్‌గా పనిచేసింది. ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించారని కందాపై అభియోగం.

ఇదిలా వుంటే, కందా ఇంకా పరారీలోనే ఉన్నారు. ఎండిఎల్ఆర్ కార్యాలయానికి చెందిన మరో ముగ్గురుని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. వారిలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ పరాశర్. పరాశర్‌ను ప్రశ్నించడానికి పోలీసులు అదుపులోకీ తీసుకున్నారు. అరుణా చద్దా పోలీసు కస్టడీని మరో రోజు కోర్టు పొడిగించింది.

అజ్ఞాతంలోకి వెళ్లి కందా అజ్ఞాతంలోకి వెళ్లి గీతికతో తనకు గల సంబంధాలపై ఉన్న ప్రతి సాక్ష్యాన్ని తుడిచేయడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గీతిక ఇ- మెయిల్ పాస్‌వర్డ్‌ను పోలీసులు ఇప్పటి వరకు సంపాదించలేకపోయారు. కాల్ రికార్డులను మాత్రం పొందారు. కందా గీతికకు పంపిన 400 పేజీల టెక్స్ట్ మెసేజ్‌ను వారు పరిశీలిస్తున్నారు. కందా ఇల్లు, ఫామ్‌హౌస్, కార్యాలయాల నుంచి స్వాధీనం చేసుకున్న కంప్యూటర్ల హార్డ్‌డిస్క్‌లు మాయమయ్యాయి.

గీతిక ఇంటికి సమీపంలోలో అశోక్ విహార్‌లో కందాకు ఫ్లాట్ ఉందా, లేదా అనే విషయాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. అరుణ చద్దాను పలుమార్లు విచారించిన అనంతరం పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తమ ఎదుట హాజరవ్వాలని కందాకు కూడా పోలీసులు నోటీసులు పంపించారు. నోటీసులు పంపించి రోజులు గడుస్తున్నా కందా నుండి ఎలాంటి స్పందన లేదు. అతను విచారణకు హాజరు కావడం లేదు. ఆదివారం గీతిక శర్మ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె తన సూసైడ్‌ నోట్‌లో కందా పేరు పేర్కొంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Former Haryana minister Gopal Goyal Kanda on Monday moved the Delhi high court for anticipatory bail in the Geetika Sharma suicide case, four days after his bail plea was dismissed by a lower court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more