చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'మహా' మాజీ సిఎం విలాస్ రావు దేశ్‌ముఖ్ కన్నుమూత

By Pratap
|
Google Oneindia TeluguNews

Vilas Rao Deshmukh
చెన్నై: కేంద్రమంత్రి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్ మంగళవారం కన్ను మూశారు. కిడ్నీ, కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్న విలాస్‌రావు చెన్నైలోని గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. గ్లోబల్ ఆసుపత్రి వైద్యులు వెంటిలెటర్ పైన ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తూ వచ్చారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఆయనకు 67 ఏళ్లు.

విలాస్‌రావు ఏడాది క్రితం చేయించుకున్న వైద్య పరీక్షల్లో వ్యాధి విషయం బయటడింది. దీంతో రెండుమూడుసార్లు ఆయన విదేశాలలో చికిత్స చేయించుకున్నారు. ముంబైలోని బీచ్ క్యాండీ ఆసుపత్రిలో కూడా విలాస్‌రావుకు మూడు రోజులు డయాలసిస్ చేశారు. అయినా పరిస్థితి మెరుగు కాకపోవడంతో ఆయనను చెన్నైలోని గ్లోబల్ ఆసుపత్రికి తరలించారు. విలాస్‌రావుకు కాలేయ మార్పిడికి కూడా ప్రయత్నాలు చేసినట్లు సమాచారం.

విలాస్‌రావు దేశ్‌ముఖ్ 26 మే 1945లో జన్మించారు. ఆయన లాతూరు జిల్లాలోని బభల్‌గావ్‌లో జన్మించారు. మొదటి నుండి కాంగ్రెసు పార్టీలోనే ఉన్నారు. ఆయనకు ముగ్గురు పిల్లలు. ప్రముఖ సినీ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ ఆయన తనయుడే. ఆయన మహారాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1999 నుండి 2003 వరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆ తర్వాత 2004 నుండి 2008 వరకు మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రెండు విడతలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన ఈ రెండుసార్లు లాతూర్ నుండి గెలుపొందారు.

ఆ తర్వాత కేంద్రమంత్రివర్గంలోకి వెళ్లిపోయారు. విలాస్ రావు మన్మోహన్ సింగ్ మంత్రి వర్గంలో భారీ పరిశ్రమల శాఖను, పంచాయతీరాజ్ శాఖను, గ్రామీణాభివృద్ధి శాఖను, ఎర్త్ సైన్స్ శాఖను, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖను చేపట్టారు. ఇతను ముంబయి క్రికెట్ అసోసియేషన్ మెంబర్‌గా ఉన్నారు.

English summary
Maharastra former chief minister Vilas rao Deshmukh, who was suffering from a serious liver ailment, passed away. arlier, an attempt to harvest liver from a brain dead donor from a government hospital here had proved futile as the man died before doctors could operate on him on Tuesday night, they said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X