హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎపి పైనా ఎఫెక్ట్: నగరం వీడుతున్న ఈశాన్యవాసులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: అస్సాం అల్లర్ల ప్రభావం మన రాష్ట్రం పైనా కూడా పడింది. హైదరాబాదులోని హైటెక్ సిటీ పరిసర సిద్ధిక్ నగర్‌లో ఈశాన్య రాష్ట్ర వాసులు నివసిస్తున్నారు. అస్సాం అల్లర్ల నేపథ్యంలో వారికి బెదిరింపు మెసేజ్‌లు, ఫోన్స్ వస్తున్నట్లుగా తెలుస్తోంది. తక్షణమే రాష్ట్రం విడిచి వెళ్లాలని, లేదంటే హతమార్చుతామంటూ మెసేజ్‌లు, ఫోన్లు వెళ్లినట్లుగా తెలుస్తోంది. దీంతో వణికి పోయిన వారు ఇక్కడ నుండి ఖాళీ చేసి వెళుతున్నట్లుగా వార్తలు వెలువడుతున్నాయి.

ఈశాన్య రాష్ట్రాల ప్రజలు వెళుతుండటంతో రైల్వే స్టేషన్ కిట కిటలాడుతోంది. సుమారు పదివేల మంది ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లేందుకు నగరం నుండి పయనమైనట్లుగా సమాచారం. మరోవైపు పోలీసు అధికారులు రక్షణ లేదనే భయంతో ఎవరూ హైదరాబాద్ విడిచి వెళ్లవద్దని సూచిస్తున్నారు. ఎవరికైనా ఏమైనా బెదిరింపు కాల్స్ వచ్చినా, మెసేజ్‍‌లు వచ్చినా పోలీసుల దృష్టికి తీసుకు వస్తే రక్షణ కల్పిస్తామని చెప్పారు. అస్సామీ అల్లర్ల ప్రభావం ఇక్కడ లేదన్నారు.

మరోవైపు ఈశాన్య రాష్ట్రాల వారు బెదిరింపులకు భయపడి వెళ్లడం లేదని వారి రాష్ట్రంలోని పరిస్థితుల దృష్ట్యా అక్కడ తమ వారిని చూసేందుకు, వారు రమ్మని ఫోన్లు చేసినందు వల్లనే వెళుతున్నారని సిద్ధిక్ నగర్ స్థానికులు చెబుతున్నారు. ఒకవేళ వారు భయపడి వెళ్లదల్చుకున్నా తాము అండగా ఉంటామని వారికి స్పష్టం చేశామని, అయితే వారు మాత్రం తాము భయంతో వెళ్లడం లేదని చెబుతున్నారని అంటున్నారు.

English summary
Andhra Pradesh effected by Assam riots. More than ten thousand Assam people are leaving Hyderabad for threat call and messages.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X