• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గీతిక ఆత్మహత్య: కందాపై నాన్ బెయిలబుల్ వారంట్

By Pratap
|

Gopal Kanda
న్యూఢిల్లీ: ఎయిర్ హోస్టెస్ గీతికా శర్మ ఆత్మహత్య కేసులో హర్యానా మాజీ మంత్రి గోపాల్ గోయల్ కందాకు ఢిల్లీ కోర్టు గురువారం నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. గీతికను ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కందాపై ఆరోపణలున్న విషయం తెలిసిందే. తనపై కేసు పెట్టినప్పటి నుంచి కందా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. ఈ కేసులో అరుణా చద్దాను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.

కందా ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ పెండింగులో ఉండగానే రోహిణి కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. కందా ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను ఢిల్లీ హైకోర్టు ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. సిర్సాలోని కందా నివాసంలో ఢిల్లీ పోలీసులు బుధవారం రాత్రి మరోసారి సోదాలు నిర్వహించారు. కందా బంధువును ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు మొబైల్ ఫోన్లను ట్రాక్ చేసిన తర్వాత పోలీసులు ఈ సోదాలు నిర్వహించారు.

గీతిక ఈ నెల 5వ తేదిన కందా, చద్దా తనను వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఓ లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంది. గీతికతో మాట్లాడేందుకు కందా ఉపయోగించిన సిమ్ కార్డ్స్ తన కంపెనీలో పని చేస్తున్న ఇతర ఉద్యోగి పేరు మీద తీసుకున్నవని తెలుస్తోంది. సిమ్ కార్డు ఎవరి పేరు మీద ఉందో ఆ ఉద్యోగిని కూడా అరెస్టు చేశారు.

గీతిక ఎండిఎల్ఆర్‌లో ఉద్యోగం చేస్తున్న సమయంలో తన పని పూర్తయిన తర్వాత కందాను కలిసి పూర్తి రిపోర్ట్ ఇచ్చేదని విచారణ అధికారులు గుర్తించారు. అలాగే కొన్ని షాకింగ్ విషయాలు కూడా వారి దృష్టికి వచ్చాయి. ఈ కేసులో అరెస్టైన అరుణ చద్దా.. గీతికకు అబార్షన్ అయిందని చెప్పి కొత్త ట్విస్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే గీతిక కుటుంబ సభ్యులు మాత్రం ఆ విషయాన్ని ఒప్పుకోవడం లేదు.దర్యాఫ్తును పక్కదోవ పట్టించి కేసును నీరుగార్చేందుకే అరుణ చద్దా గీతికకు అబార్షన్ అయిందని చెబుతుండవచ్చునని కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A Delhi court on Thursday issued a non-bailable warrant against former Haryana minister Gopal Goyal Kanda in the Geetika Sharma suicide case. Kanda has been charged with abutment to suicide of the former air hostess. The Sirsa strongman has been on the run for ten days ever since the case was lodged against him and his aide Aruna Chaddha. Both of them were named by Geetika in her suicide note.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more