హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాలకృష్ణ తెలంగాణ ప్రకటనపై అడుసుమిల్లి ఫైర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Balakrishna
హైదరాబాద్: తెలంగాణపై తెలుగుదేశం వైఖరి చెబుతూ సినీ నటుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్ తప్పుపట్టారు. బాలకృష్ణ ప్రకటన సినిమాటిక్‌గా ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణపై తెలుగుదేశం అంత స్పష్టమైన నిర్ణయం తీసుకొని ఉంటే సీమాంధ్ర ప్రయోజనాలు కాపాడటంలో ఎందుకు స్పందించటం లేదని, తెలుగు తల్లిని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నానా మాటలు అన్నప్పుడు నోరు విప్పలేదేమని ఆయన బాలకృష్ణను ప్రశ్నించారు.

ఈ మేరకు అడుసుమిల్లి గురువారం ఇక్కడ ఒక ప్రకటన విడుదల చేశారు. సాగునీటి విడుదల.. విద్యార్థుల కౌన్సెలింగ్, తెలుగు సినిమా షూటింగ్‌లను అడ్డుకొన్నప్పుడు బాలకృష్ణ ఎందుకు జోక్యం చేసుకోలేదని, తాము తెలంగాణకు మద్దతు ఇస్తున్నామని, తమ జోలికి రాకండి అని ఆనాడు బాలకృష్ణ ప్రకటన చేసి ఉండొచ్చు కదా అని, ఇంత ఆలస్యంగా కళ్లు తెరవటంలో ఆంతర్యం ఏమిటని ఆయన అన్నారు.

ఇప్పటి వరకు చంద్రబాబు కప్పదాటు రాజకీయాలను మాత్రమే అసహ్యించుకుంటున్న సీమాంధ్ర ప్రజలు, ఇక బాలకృష్ణ సినిమాలనూ తిరస్కరించటం మొదలుపెడతారని తెలిపారు. తెలుగువారి ఐక్యత, ఆత్మగౌరవం కోసం పాటుపడిన ఎన్టీఆర్ తనయుడిగా తెలుగువారి విభజనకు సమ్మతించటం సరైందేనా? అని బాలకృష్ణను నిలదీశారు.

"సొంత బావకు నచ్చచెప్పాల్సింది పోయి, మరేదో రాజకీయ ప్రయోజనం ఆశించి తెలంగాణ అనుకూల ప్రకటన చేశారా? లేక రాష్ట్ర విభజనకు కేంద్రం అంగీకరించే స్థితిలో లేదని కచ్చితంగా తెలుసుకొని టీడీపీ ఆడుతున్న కొత్త నాటకంలో బాలకృష్ణ పావుగా మారాడా?'' అనే సందేహాలను అడుసుమిల్లి వ్యక్తంచేశారు.

English summary
Former MLA Adusumilli Jayaprakash has questioned Telugudesam party leader and actor Balakrishna's statement on Telangana. He should answer several questions on Telangana statement, he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X