• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కాగ్ నివేదిక వెల్లడి: బొగ్గు కేటాయింపుల్లో స్కామ్

By Pratap
|

CAG says private firms gain Rs 1.86 lakh crore in coal block allocation
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభల్లో కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ (కాగ్) నివేదికను శుక్రవారం ప్రవేశపెట్టారు. బొగ్గు, విద్యుత్, ఢిల్లీ విమానాశ్రయాల నిర్మాణాలపై కాగ్ నివేదికను లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రవేశపెట్టారు. అందులో 2జీ కుంభకోణం కన్నా బొగ్గు కుంభకోణం పెద్దదని నివేదికలో అభిప్రాయపడింది. బొగ్గు కేటాయింపుల్లో తప్పుడు విధానాల వల్ల ప్రభుత్వ ఖజానాకు 1.86 లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిదని కాగ్ పేర్కొంది.

2004 నుంచి 2009 మధ్య జరిగిన బొగ్గు కేటాయింపులపై కాగ్‌ శుక్రవారం నివేదిక సమర్పించింది. బొగ్గు గనుల కేటాయింపులో భారీగా అక్రమాలు జరిగాయని నిర్థారించింది. ప్రైవేటు కంపెనీలకు లబ్ధి చేకూరేలా ప్రభుత్వం వ్యవహరించదని కాగ్‌ తీవ్రంగా తప్పుపట్టింది. టాటా గ్రూపు సంస్థలు, జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌, అనిల్‌ అగర్వాల్‌ సంస్థలు, ఎస్సార్‌ గ్రూపు సంస్థలు, అదాని గ్రూపు, ఆర్సెలర్‌ మిట్టల్‌, ల్యాంకో సంస్థలకు బొగ్గు కేటాయింపుల్లో బాగా ప్రయోజనం పొందాయని కాగ్‌ స్పష్టం చేసింది. మొత్తం 25 కంపెనీల జాబితాను కాగ్ ఇచ్చింది.

అదే విధంగా ఢిల్లీ విమానాశ్రయంపై కూడా కాగ్‌ నివేదిక ఇచ్చింది. ఏడాదికి కేవలం 100 రూపాయల అద్దెతో 60 ఏళ్ల పాటు జీఎంఆర్‌కు భూమి కేటాయించారని కాగ్‌ చెప్పింది. దీనివల్ల ప్రభుత్వానికి 60 ఏళ్లలో 1,63,557 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం పోయిందని తేల్చింది.

ఇదిలావుంటే, అసోం అల్లర్లపై పార్లమెంట్ ఉభయ సభలూ దద్దరిల్లాయి. శుక్రవారం ఉదయం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే పూణె, బెంగుళూరు, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి పెద్ద సంఖ్యలో ఈశాన్య రాష్ట్రాల ప్రజలు సొంత ఊళ్లకు వెళ్లిపోతుండడంపై లోక్‌సభ, రాజ్యసభలోనూ విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. దీనిపై ప్రధానమంత్రి వివరణ ఇవ్వాలని సభ్యులు పట్టుపట్టడంతో మన్మోహన్‌సింగ్ వివరణ ఇచ్చారు.

పుకార్ల నేపథ్యంలో ఎవరూ సొంత స్థలాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రక్షణ కల్పిస్తాయని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. బెదిరింపులకు పాల్పడేవారిని, పుకార్లు సృష్టిస్తోన్నవారిని కఠినంగా శిక్షించాలని బీజేపీ నేత సుష్మా స్వరాజ్ డిమాండ్ చేశారు. మరోవైపు ప్రభుత్వం ఎవరిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతుందో స్పష్టం చేయాలని జేడీయూ నేత శరద్ యాదవ్ కోరారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary

 Government auditor CAG today said private firms are likely to gain Rs 1.86 lakh crore from coal blocks that were allocated to them on nomination basis instead of competitive bidding, which amounted to the loss to national exchequer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more