వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ సన్నిహితుడికి 9 కోట్లిచ్చా: భాను కిరణ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Bhanu Kiran
హైదరాబాద్: హంద్రీ - నీవా ప్రాజెక్టు కాంట్రాక్టులో పొందిన డబ్బుల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ‌సన్నిహితుడికి 9 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు మద్దెలచెర్వు సూరి హత్య కేసులో నిందితుడు భాను కిరణ్ చెప్పాడు. ఈ మేరకు సూరి హత్య కేసు నిందితుడు భానుకిరణ్, అతడి ముఠా చేసిన దందాల్లో హంద్రీనీవా కాంటాక్టుల సెటిల్‌మెంట్‌పై సీఐడీ రెండో చార్జిషీట్ దాఖలు చేసింది. ఇందులో ఏ1గా భాను, ఏ2గా దంతలూరి కృష్ణ, ఏ3గా నీలం శ్రీనివాస్ (అలియాస్ చిన్నా), ఏ4గా మోహన్‌రాజ్‌ను సిఐడి చేర్చింది.

ఆ ప్రాజెక్టులో ఏయే కాంట్రాక్టులు ఎవరెవరికి ఇప్పించి, ఎంతెంత వసూలు చేసిందీ సిఐడి రెండో చార్జ్‌షీట్‌లో పొందుపరిచింది. హంద్రీనీవా ప్రాజెక్టులో మొత్తం రూ.170 కోట్ల విలువైన పనులను దక్కించుకున్న మూడు నిర్మాణ సంస్థలను బెదిరించి భాను రూ.18 కోట్లు వసూలు చేశాడని సిఐడి అభియోగం మోపింది. జీవీఆర్ అనే నిర్మాణ సంస్థకు రూ.66 కోట్ల విలువైన కాంట్రాక్టు సెటిల్ చేసిన కేసులో రూ.6.5 కోట్లు, జేకే కన్‌స్ట్రక్షన్ సంస్థకు రూ.72 కోట్ల విలువైన కాంట్రాక్టు ఇప్పించినందుకు రూ.8.6కోట్లు, కోస్టల్ కన్‌స్ట్రక్షన్‌కు రూ.30 కోట్ల కాంట్రాక్టు దక్కేందుకు సాయం చేసినందుకు రూ.3 కోట్లు వసూలు చేశారని సిఐడి ఆరోపించింది.

తాము వసూలు చేసిన మొత్తంలో ప్రధానమైనది జగన్ అనుచరుడు నీలం శ్రీనివాస్ అలియాస్ చిన్నా అనే వ్యక్తికి భాను రూ.9 కోట్లు ఇచ్చినట్లు భాను వెల్లడించినట్లు సిఐడి నాంపల్లి కోర్టుకు నివేదించింది. పరిటాల హత్య కేసులో నిందితుడుగా ఉంటూ నే జైల్లో హత్యకు గురైన మొద్దు శీనుకు రూ. కోటి, దంతలూరి కృష్ణకు రూ.కోటి మూడు లక్షలు, సూరి సోదరి హేమలతకు రూ.20 లక్షలు ఇచ్చినట్లు భాను వెల్లడించారని పోలీసులు చార్జ్‌షీట్‌లో వివరించారు.

వైయస్ సంతాప కార్యక్రమాలకు రూ.20 లక్షలు ఖర్చు చేసినట్లు భాను చెప్పాడు. గతంలో పరిటాల సునీతపై పొటీ చేసిన అభ్యర్థి కోసం రూ.30 లక్షలు ఖర్చు పెట్టినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు. ఇప్పటి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత గుర్నాథరెడ్డి సోదరుడు రెడ్డప్పరెడ్డి అనంతపురంలో ఒక సెటిల్‌మెంట్ విషయంలో రూ.80 లక్షలు ఆఫర్ చేసినట్లు సిఐడి గుర్తించింది.

మే నెలలో కోర్టుకు అందించిన రిమాండ్ డైరీలో, జూన్‌లో దాఖలు చేసిన మొదటి చార్జిషీట్‌లో భాను భూదందాలపై సీఐడీ పలు విషయాలు కోర్టుకు నివేదించింది. సూరి హత్య జరక్క ముందు అనిల్ అనే వ్యక్తి నుంచి రివాల్వర్ తీసుకున్నట్లు, అప్పటికే తన వద్ద కొన్ని గన్‌లు ఉండటంతో.. వాటిలో రెండు రోగిటపల్లి నరేందర్‌రెడ్డి, సురేష్‌రెడ్డి అనే ఇద్దరికి ఇచ్చినట్లు భాను వెల్లడించినట్లు పోలీసులు తెలిపిన విషయం తెలిసిందే.

English summary
According to CID chargesheet filed in Nampally Court - Bhanu Kiran, accused in Maddelachervu Suri murder case, said that he has given Rs 9crore ro YSR Congress party president YS Jagan follower Neelam Srinivas alias Chinna.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X