హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

క్రికెట్ అనుకుంటున్నారు:కిరణ్‌పై విద్యాసాగరరావు సెటైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vidyasagar Rao
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పరిపాలన అంటే క్రికెట్ ఆట అనుకుంటున్నట్లుగా ఉన్నారని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి సిహెచ్ విద్యాసాగర రావు సోమవారం ఎద్దేవా చేశారు. ఆయన హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాద రావు రాజీనామాపై గవర్నర్ నరసింహన్ వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ధర్మాన రాజీనామాను ఎందుకు ఆమోదించలేదో కిరణ్ ప్రజలకు చెప్పాలన్నారు.

ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు కేంద్రం భద్రతపై హామీ ఇవ్వలేక పోతుందని విద్యాసాగర రావు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఆపాల్సింది బల్క్ ఎస్సెమ్మెస్‌లు కాదని.. బంగ్లాదేశ్ చొరబాటుదారులను అన్నారు. రాజ్యాంగంలో లేని విషయాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు చెబుతూ మోసం చేస్తున్నాయని విమర్శించారు. సరిహద్దు ప్రాంతాల నుండి దేశంలోకి చొరబడుతున్న విదేశీయులపై కఠిన చర్యలు తీసుకోనంత కాలం జాతి సమగ్రతను కాపాడటం అసంభవమని అన్నారు.

అస్సాం అల్లర్లను అదుపు చేయడంలో, అక్కడి ప్రజలకు మనోధైర్యాన్ని కల్పించడంలో కేంద్రం విఫలమైందన్నారు. ప్రస్తుతం మన దేశంలో 12వేల మందికి పైగా అక్రమ చొరబాటుదారులు ఉన్నారన్నారు. చొరబాటుదారులు దేశంలోకి రాకుండా కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. లేకుంటే అస్సాం వంటి పరిస్థితులు తలెత్తుతాయన్నారు.

English summary

 Bharatiya Janata Party senior leader and former central minister CH.Vidyasagar Rao said that CM Kiran Kumar Reddy is thinking administration means cricket.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X