వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గీతిక ఆత్మహత్య: అసహజమైన సెక్స్‌ కూడా కారణం

By Pratap
|
Google Oneindia TeluguNews

Geetika Sharma-Gopal Kanda
న్యూఢిల్లీ: అసహజమైన సెక్స్ కార్యకలాపాలకు గురి చేయడం కూడా ఎయిర్‌హోస్టెస్ గీతికా శర్మ ఆత్మహత్యకు కారణమని అంటున్నారు. శవపరీక్షలో ఈ విషయం తేలినట్లు సమాచారం. గీతికా శర్మ ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు హర్యానా మాజీ మంత్రి గోపాల్ గోయల కందా 11 రోజుల అజ్ఞాతం తర్వాత పోలీసుల చేతికి చిక్కారు. ఉరేసుకోవడం వల్లనే గీతికా శర్మ మరణించినట్లు శవపరీక్షలో తేలింది.

ఆగస్టు 5వ తేదీన గీతికా శర్మ ఆత్మహత్య చేసుకుంది. గోపాల్ కందా, ఎండిఎల్ఆర్ ఉద్యోగిని అరుణా చద్దా తన ఆత్మహత్యకు కారణమని, తనను వారు మానసిక హింసకు గురి చేయడం వల్లనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని ఆమె సూసైడ్ నోట్‌లో ఆరోపించింది.

గీతికా శర్మ యోని ద్రావకాలను డిఎన్ఎ పరీక్షకు పంపించారు. ఈ పరీక్ష గీతికా శర్మ ఆత్మహత్యకు సంబందించిన ఇతర కారణాలను కూడా తెలియజేయవచ్చునని భావిస్తున్నారు. శవపరీక్ష నివేదికను మీడియాకు విడుదల చేశారు. గీతికా శర్మను ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న కందా ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నారు. ఆయనను ఏడు రోజుల విచారణ నిమిత్తం పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు.

ఇదిలావుంటే, గీతికా శర్మ కేసును తమకు అనుకూలంగా మలుచుకునేందుకు హర్యానా ప్రతిపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. కందాను కాపాడడానికి ప్రయత్నించి ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కందాకు నేరచరిత్ర ఉందని, గతంలో కూడా ఆయన ఇటువంటి కేసుల్లో ఇరుక్కున్నారని ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ పార్టీ నాయకుడు అజయ్ చౌతాలా రోహతక్‌లో మీడియాతో అన్నారు.

English summary
With former Haryana Minister Gopal Kanda, main accused in the Geetika Sharma suicide case, surrendering after evading arrest for close to 11 days, the drama with regard to the case seems to be far from over. The autopsy report of the former airhostess Geetika has revealed that she died from hanging. The report also says that Geetika was subjected to unnatural act which could also be one of the reasons the ambitious woman chose to end her life.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X