• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గీతిక ఆత్మహత్య: ఫ్యామిలీకి ఫోన్‌కాల్స్, కందా విచారణ

By Srinivas
|

Gopal Kanda - Geetika Sharma
న్యూఢిల్లీ: మాజీ ఎయిర్ హోస్టెస్ గీతిక శర్మ ఆత్మహత్య కేసులో అరెస్టైన ప్రధాన నిందితుడు, మాజీ మంత్రి గోపాల్ కందాను పోలీసులు విచారిస్తున్నారు. గీతిక శర్మ రెండు వారాల క్రితం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె తన సూసైడ్ లెటర్‌లో గోపాల్ కందా పేరును ప్రస్తావించింది. దీంతో పోలీసులు అతడినే ప్రధాన నిందితుడిగా భావిస్తున్నారు. గీతిక ఆత్మహత్య తర్వాత తప్పించుకు తిరిగిన కందా నాలుగు రోజుల క్రితం పోలీసుల ఎదుట లొంగిపోయారు.

కందాను కోర్టులో ప్రవేశ పెట్టిన పోలీసులు అతనినిని విచారించేందుకు అనుమతించాలని పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల విజ్ఞప్తి మేరకు కోర్టు కందాను వారం రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగించింది. వారు కందా నుండి నిజాలు కక్కించే పనిలో పడ్డారు. ఆయనను తొలి రోజు విచారించారు. గూర్గావ్‌లోని తన కార్యాలయానికి కందాని తీసుకు వెళ్లి పోలీసులు తనిఖీలు చేయనున్నారు. ఇప్పటికే ఆయనకు చెందిన పలు కార్యాలయాల్లో తనిఖీలు చేశారు. ఏడు రోజుల కస్టడీలో ఆయన నుండి పూర్తి వివరాలు కూపీలాగే పనిలో పోలీసులు పడ్డారు.

కాగా మరోవైపు గీతిక కుటుంబ సభ్యులు తమ ఇంటికి తప్పుడు కాల్స్ వస్తున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు శనివారం మూడు ఫోన్ కాల్స్, శుక్రవారం ఐదు ఫోన్ కాల్స్ గుర్తు తెలియని వ్యక్తుల నుండి వచ్చాయని తెలిపారు. అవతలి నుండి ఫోన్స్ చేస్తున్న వ్యక్తి సెల్ ఫోన్ నుండి మాట్లాడినప్పుడు ఏమీ మాట్లాడటం లేదని, కానీ తమ ఇంటి ల్యాండ్ లైన్‌కు చేసినప్పుడు మాత్రం గీతిక గురించి అడిగారని గీతిక సోదరుడు అంకిత్ చెప్పారు.

తమకు ఫోన్‌లు రావడం వెనుక కందా హస్తం ఉండవచ్చునని, గీతిక ఆత్మహత్య కేసును పక్కదారి పట్టించేందుకో లేదా విచారణ కొనసాగకుండా చేసేందుకే ఇలా చేస్తుండవచ్చునని అనుమానాలు వ్యక్తం చేశారు. తాము ఇంటిలో ముగ్గురం మాత్రమే ఉంటామని, తాము భయాందోళనకు గురవుతున్నామని చెప్పారు. ఈ కారణంగానే తాము శనివారం కందాను చూసేందుకు కోర్టుకు వెళ్లలేదని చెప్పారు. మూడు రోజుల క్రితం ఓ ఫోన్ వచ్చిందని, తాను జాబ్ పోర్టల్ నుండి కాల్ చేస్తున్నానని, గీతికతో మాట్లాడాలని చెప్పారని, ఆ కాల్ వచ్చింది ల్యాండ్ లైన్‌కని, కానీ తమ ల్యాండ్ లైన్ నెంబర్ బంధువులు, స్నేహితులకు తప్ప ఇంకెవరికీ ఇవ్వలేదని అలాంటప్పుడు కాల్ ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదన్నారు.

English summary

 For Geetika Sharma's family, the ordeal is not over yet. After losing their daughter and enduring the pain of seeing their daughter's tormentor—Gopal Goyal Kanda—evade law's long arm for 12 days, the family claims it is being harassed by crank callers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X