వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గల్ఫ్‌కు బార్‌గర్ల్స్: వ్యభిచార రాకెట్‌లో ముగ్గురి అరెస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hotelier’s aide held in sex racket
ముంబయి: అమ్మాయిలను బలవంతంగా సెక్స్ రొంపిలోకి దింపుతున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు వ్యక్తులను ఎస్ఎస్‌బి పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో ఓ హోటల్ నడుపుతున్న వ్యక్తి సన్నిహితుడు కూడా ఉన్నాడు. జీవన్ కాంబ్లే, మొహమ్మద్ అన్వర్ షేక్, అనీల్ కుమార్‌లను అరెస్టు చేశారు. ఇందులో అనీల్ కుమార్ ఖర్‌లో హోటల్ నడుపుతున్న రాజ్‌కు అసోసియేట్. ఈ నెల 14వ తారీఖున ఎస్ఎస్‌బి పోలీసులు 37 మంది బార్ గర్ల్స్‌ను న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

దుబాయ్, మస్కట్‌లలో స్టేజ్ ఫర్మార్మెన్స్ ఇచ్చేందుకు వారు ఎయిరిండియా ఫ్లైట్‌లో వెళ్లేందుకు విమానాశ్రయానికి చేరుకున్న సమయంలో పోలీసులు వారిని గుర్తించారు. డ్యాన్సర్లుగా వీరిని మధ్యవర్తులు పంపిస్తున్నప్పటికీ అక్కడ వారిని వ్యభిచార రొంపిలోకి దింపుతున్నారని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేశారు. అందుకే అమ్మాయిలని అదుపులోకి తీసుకొని సూత్రదారుల కోసం అప్పటి నుండి వేట ప్రారంభించారు. ఆదివారం వారు దొరికారు.

అమ్మాయిలను పంపించడంలో పై ముగ్గురి పాత్ర ఉందని పోలీసులు భావిస్తున్నారు. అలాగే హోటల్ నడుపుతున్న వ్యక్తి పాత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇంకా ఇందులో ఎవరి పాత్రనైనా ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ప్రియ అనే వ్యక్తి వారిని వ్యభిచార రొంపిలోకి బలవంతంగా దింపే ప్రయత్నాలు చేస్తోందని ఇప్పటికే పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది.

కాగా అరబ్ దేశాలలో యువతులకు ఉన్న డిమాండ్‌ను సొమ్ము చేసుకోవాలన్న ఓ ముఠా గుట్టు ఇటీవల రట్టయిన విషయం తెలిసిందే. గత బుధవారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఐజిఐఏ)లో 37 మంది బార్ గర్ల్స్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. డ్యాన్సర్లుగా వీరిని దుబాయ్‌కు పంపిస్తున్న మధ్యవర్తుల కోసం ముంబయి పోలీసులు గాలిస్తున్నారు. మంగళవారం రాత్రి 8.25 గంటలకు దుబాయ్ వెళ్లే విమానంలో ముంబయికి చెందిన 37 మంది బార్ గర్ల్స్ ప్రయాణించాల్సి ఉందని, ఆ యువతులంతా డ్యాన్సర్లుగా చలామణి అవుతూ గమ్యం చేరుకోగానే మధ్యవర్తులు వీరిని బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దింపుతారని ముంబయి పోలీసు సామాజిక సేవా విభాగం అధికారి ఒకరు తెలిపారు.

విషయం తెలుసుకున్న ముంబయి ఎసిబి వసంత్ డోబ్లే ఈ ముఠా గుట్టు రట్టు చేశారన్నారు. అరబ్ దేశాలలో ముంబయి బార్ గర్ల్స్‌కు విపరీతమైన డిమాండ్ ఉంది. మరోవైపు వారికిదే ఆదాయ వనరు కావడంతో విదేశాలకు వెళ్లేందుకు వారూ మొగ్గు చూపుతుంటారు. విమానాశ్రయంలోని కొందరు అధికారులతో గల్ఫ్ ఏజెంట్లకున్న సంబంధాల వల్ల వీరి వాస్తవికతను తనిఖీ చేయకుండా వీసాలు క్లియర్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. 2005 నుండి మహారాష్ట్ర ప్రభుత్వం డ్యాన్స్ బార్లను నిషేధించింది. ఇమ్మిగ్రేషన్ అధికారులు కఠినంగా వ్యవహరించడం వల్ల వీరిని ఢిల్లీ, చెన్నై, హైదరాబాదు మీదుగా విదేశాలకు పంపడం ప్రారంభించారు. పోలీసు బిల్లును ఆమోదించడం ద్వారా డ్యాన్స్ బార్లను మూసివేయించినప్పటిక ఆ మహిళలకు జీవనోపాధి కల్పించడంలో మాత్రం సర్కారు విఫలమైంది.

English summary
The social service branch (SSB) on Sunday arrested three persons, including the close associate of a hotelier from the western suburbs, in a human trafficking and prostitution case. They are Jivan Kamble (40), Mohammed Anwar Shaikh (50) and Anil Kumar Acharya (36). Acharya is an associate of Raj Shetty, chairman, Ramee Guestline hotel in Khar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X