వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వేట ఆపండి: ఒబామాకు వికీలీక్స్ అసాంజే హెచ్చరిక

By Srinivas
|
Google Oneindia TeluguNews

Julian Assange
లండన్: వికీలీక్స్‌ను, తనను వెంటాడటం, వేధించడం ఆపాలని జూలియన్ అసాంజే ఆదివారం లండన్ నడిబొడ్డుపై నున్న ఈక్వెడార్ ఎంబసీ నుండి మాట్లాడుతూ అమెరికా, బ్రిటన్‌లను హెచ్చరించారు. తనను, వికీలీక్స్‌నూ అణచివేయడంలో ఐక్యత కనిపించిందని, అయితే, అంతే సంఘటితంగా ప్రతిఘటన కూడా ఉండి తీరుతుందని వికీలీక్స్ వ్యవస్థాపకుడు అసాంజే గర్జించారు. తనపై, వికీలీక్స్ సంస్థపై కుట్రపూరిత వేటను ఆపాలని అమెరికాను ఘాటుగా హెచ్చరించారు.

మంచి ఆలోచనలు చేయాలని అధ్యక్షుడు బరాక్ ఒబామాకు బహిరంగంగా సూచించారు. బ్రిటన్ అరెస్టు హెచ్చరికలు, దౌత్యపరమైన హూంకరింపుల మధ్య అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన అసాంజే రెండు నెలల తరువాత తొలిసారి లండన్‌లోని ఈక్విడార్ దౌత్య కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. బ్రిటన్ వైమానిక దళ హెలికాప్టర్ల చక్కర్లు, వంద మంది పోలీసు అధికారుల మోహరింపు మధ్య దౌత్య మీడియాతో మాట్లాడారు.

కార్యాలయం లండన్‌లో ఉన్నా.. సాంకేతికంగా అది ఈక్విడార్ పరిధిలో ఉన్నట్టు లెక్క.. దీంతో లండన్ నడిబొడ్డున అసాంజే మీడియా సమావేశం పెట్టినా బ్రిటన్ ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది. పైకి బ్రిటన్ వేధింపుల్లా కనిపించినా, తెర వెనుక ఉండి ఆడిస్తున్నది అమెరికాయేనని అసాంజే స్పష్టం చేశారు. వాస్తవాలను వెలుగులోకి తెచ్చేవారిని వేధించవద్దని, వికీలిక్స్‌పైన గానీ ద న్యూయార్క్ టైమ్స్ పైన గానీ దర్యాప్తునకు ప్రయత్నించడమంత బుద్ధితక్కువపని మరొకటి లేదని అమెరికాపై నిప్పులు చెరిగారు.

తానున్న భవనం చుట్టూ మోహరించిన బలగాలపై స్పందిస్తూ.. దౌత్య కార్యాలయ భవనం చుట్టూ బలగాలు తుపాకులతో సంచరిస్తున్నాయని, అగ్ని ప్రమాదాల సమయంలో బయటపడేందుకు కార్యాలయంలో ఉండే దారుల గుండా లోపలకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాయని, ఆ బూట్ల చప్పుడు నాకు స్పష్టంగా వినిపిస్తోందన్నారు. మీడియా, ప్రపంచమూ చూస్తున్నారనే వెరపు తప్ప ఐక్యరాజ్యసమితి వియన్నా తీర్మానాన్ని కాలరాయడానికి కూడా బ్రిటన్ వెనుదీయదన్నారు. తాను గత నెల 19వ తేదీ నుంచి రాయబార కార్యాలయంలోనే తల దాచుకుంటున్నట్టు చెప్పారు.

తాను మీతో ఉండలేని పరిస్థితి ఉందని, అందుకే ఇక్కడ ఉండాల్సి వచ్చిందన్నారు. ఇన్నాళ్లూ నాకూ వికీలీక్స్‌కు మీరిచ్చిన సహకారానికి ధన్యవాదాలన్నారు. కాగా వికీలీక్స్ వ్యవస్థాపకుడు అసాంజేలో పోరాట స్ఫూర్తి అణగారలేదని ఆయన న్యాయవాదులు పేర్కొన్నారు. అసాంజేతో నేరుగా మాట్లాడామని, సత్యం, న్యాయం కోసం ఆయన నిరంతరం పోరాడారని, మానవ హక్కులకు రక్షగా నిలిచారన్నారు. ఇక ముందూ ఆయన అదే పాత్రను పోషిస్తారని తెలిపారు.

English summary
WikiLeaks founder Julian Assange urged President Barack Obama to end a so-called “witch hunt” against his secret-spilling website, appearing in public Sunday for the first time since he took refuge two months ago inside Ecuador’s Embassy in London to avoid extradition to Sweden on sex crimes allegations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X