కిరణే పూర్తికాలం: ముఖ్యమంత్రి మార్పుపై కృష్ణమూర్తి

ముఖ్యమంత్రి ప్రచారం అంతా అవాస్తవమన్నారు. త్వరలో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ(పిసిసి) పునర్వ్యవస్థీకరణ ఉంటుందని, నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆయన చెప్పారు. కాగా జనాబా నిష్పత్తి మేరకు ఎస్సీలకు నామినేటెడ్ పోస్టులను ఇవ్వాలని మంత్రి కొండ్రు మురళీ మోహన్ వేరుగా అన్నారు.
బిసిలకు వంద సీట్లు ఇస్తామన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మపై పిసిసి అధికార ప్రతినిధి తులసి రెడ్డి మండిపడ్డారు. విజయమ్మ ప్రకటన హాస్యాస్పదమన్నారు. కాంగ్రెసు మాత్రమే బిసిలకు న్యాయం చేస్తుందన్నారు. అవసరమైతే రెండు వందల సీట్లు కూడా ఇచ్చేందుకు కాంగ్రెసు సిద్ధంగా ఉందన్నారు.
కాగా ఇటీవల ముఖ్యమంత్రి మార్పుపై మరోసారి జోరుగా ప్రచారం జరుగుతోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులలో మంత్రులు పలువురు ఇరుక్కోవడం, ముఖ్యమంత్రి వారికి అండగా నిలబడటం లేదనే ప్రచారం, కేంద్రమంత్రి జైపాల్ రెడ్డితో కిరణ్కు విభేదాలు తదితరాల నేపథ్యంలో కిరణ్ మార్పు ఖాయమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.