వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2014లో రాహుల్ వర్సెస్ మోడీ: కేంద్రమంత్రి సంచలనం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Beni Prasad Verma
న్యూఢిల్లీ: కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బేణి ప్రసాద్ వర్మ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ధరల పెరుగుదల, 2014లో వ్యక్తుల మధ్య పోటీ విషయంలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2014 ఎన్నికలలో అసలైన పోటీ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీకి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి మధ్యనే ఉంటుందని బేణి వ్యాఖ్యానించారు. ఉత్తర ప్రదేశ్ వ్యవహారాలలో సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ జోక్యం చేసుకోవడం వల్లనే ఆ రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా పని చేయలేక పోతోందన్నారు.

యుపి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తన కుమారుడి వంటి వాడని, ఆయనను తాను తప్పు పట్టలేనని అన్నారు. 2014 లోకసభ ఎన్నికలలో ఎస్పీ 60 సీట్లు గెలుచుకుంటే.. కేంద్రంలో మూడో ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడుతుందన్న ములాయం వ్యాఖ్యలపై బేణి స్పందిస్తూ... ములాయం ప్రధానమంత్రి కావాలని కలలు కుంటున్నారని, కానీ అది జరగదన్నారు. గతంలోనూ బేణి ప్రసాద్ వర్మ పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.

గతంలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు 80 ఏళ్లు వచ్చాయని, 2014 నాటికి ఆయనకు 82 ఏళ్లు ఉంటాయని.. అందువల్ల తర్వాత మరింతకాలం ప్రధానిగా పనిచేయడం కష్టం కాబట్టి ఈ పరిస్థితుల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేస్తారని చెప్పారు. ధరల పెరుగుదల విషయంలోనూ బేణీ వ్యాఖ్యలు విపక్షాలతో పాటు స్వపక్షాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ధరల పెరుగుదల మంచిదే కదా అని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.

ధరలు ఎంత పెరిగితే రైతులకు అంత మంచిదని, అందుకే ద్రవ్యోల్బణం పెరిగిందంటే నాకు భలే సంతోషమని, కానీ ధరలు పెరుగుతున్నాయంటూ మీడియా అనవసరంగా గగ్గోలు పెడుతోందన్నారు. ఆయన వ్యాఖ్యలపై బిజెపితో పాటు ఇతర పార్టీలూ ఒక్కసారిగా మండిపడ్డాయి. కాంగ్రెస్ నేతలపై ద్రవ్యోల్బణం ప్రభావం ఏమీ లేదని, అందుకే వారు ధరల పెరుగుదల వల్ల సామాన్యులు పడుతున్న కష్టాలను పట్టించుకోవట్లేదని బిజెపి నేత షానవాజ్ హుస్సేన్ విమర్శించారు. అసలే విద్యుత్తు సరఫరా లేక, ఎరువుల ధరలు పెరిగి కష్టాలు పడుతున్న రైతులకు.. ధరల పెరుగుదలతో ఎలా లబ్ధి కలుగుతుందని ప్రశ్నించారు.

English summary
The Congress and the BJP are yet to get there, but Union Minister Beni Prasad Verma today declared that the 2014 general elections would be a direct contest between Rahul Gandhi and Narendra Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X