కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఐఐటి మద్రాసు తెలుగు విద్యార్థిని ఆత్మహత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Manasa
చెన్నై: ఐఐటి మద్రాసులో చదువుతున్న తెలుగు విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఐఐటి మద్రాసులో ఎంటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న 21 ఏళ్ల మానస అనే విద్యార్థిని మంగళవారం ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆంధ్రప్రదేశ్‌లోని కరీంనగర్ జిల్లా గోదావరిఖనికి చెందిన అమ్మాయి. మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో తలుపులు బిగించడానికి వెళ్లిన వడ్రంగి దుప్పటితో ఉరేసుకుని వేలాడుతున్న మానసను చూశాడు.

వడ్రంగి ఆ విషయాన్ని అధికారులకు తెలియజేశాడు. పోలీసులు వచ్చిన తర్వాత ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. మానస మరణంతో కరీంనగర్ జిల్లా గోదావరి ఖనిలో విషాదం అలుముకుంది. మానస ఈ నెల 1వ తేదీన చెన్నైలోని ఐఐటి మద్రాసులో ఎంటెక్‌లో చేరింది. మానస ఆత్మహత్య చేసుకున్న సమాచారం కుటుంబ సభ్యులకు మంగళవారం సాయంత్రం చేరింది.

గోదావరిఖనిలో ఫర్నీచర్ పనులు చేసే మేర్గు రాజేశం కూతురు మానస. ఒక కుమారుడు కూడా అతనికి ఉన్నాడు. పెద్ద కూతురు మానస చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండేది. ఇంటర్మీడియట్ వరకు మానస గోదావరిఖనిలోనే చదివింది.

కెమికల్ ఇంజనీరింగ్ పుట్టపర్తిలో చేసింది. గేట్‌లో ఆ తర్వాత మంచి మార్కులు రావడంతో ఐఐటి మద్రాసులో ఎంటెక్‌లో చేరింది. కూతురు మరణవార్త తెలిసిన వెంటనే రాజేశం చెన్నైకి బయలుదేరి వెళ్లాడు. మూడు రోజుల పాటు గోదావరిఖనిలోని తల్లిదండ్రులతో ఉండి వచ్చిన వెంటనే ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. సహవిద్యార్థులు అడిగినా ఆ రోజు ఆమె క్లాసుకు వెళ్లలేదని అంటున్నారు.

English summary
Academic excellence brought 21-year-old S Merugu Manasa to IIT-Madras, where personal problems hounded her to death. Less than three weeks after attending class at the institute in Adyar, the first year MTech chemical engineering student committed suicide by hanging from the ceiling fan in her hostel dormitory on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X