వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గీతిక ఆత్మహత్య: చిక్కుల్లో బాలీవుడ్ నటి నూపుర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Nupur Mehta-Geetika Sharma
న్యూఢిల్లీ: మాజీ ఎయిర్ హోస్టెస్ గీతికా శర్మ ఆత్మహత్య కేసులో బాలీవుడ్ నటి నూపుర్ మెహతా చిక్కుల్లో పడ్డారు. గీతికా శర్మ ఆత్మహత్య కేసులో బాలీవుడ్ నటి నూపుర్ శర్మను ప్రశ్నిస్తామని ఢిల్లీ పోలీసులు బుధవారం చెప్పారు. గీతికా శర్మతో నూపుర్ మెహతాకు సంబంధాలున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంలో నూపుర్ మెహతా పేరు వెలుగులోకి వచ్చింది.

హర్యానా మాజీ మంత్రి గోపాల్ గోయల్ కందా, గీతికా శర్మ సంబంధంపై ఆమె వ్యాఖ్యలు చేసింది. మూత పడిన ఎండిఎల్ఆర్‌లో గీతికాతో పాటు నూపుర్ కూడా పనిచేసింది. ఎండిఎల్ఆర్ యజమాని గోపాల్ కందా గీతికా శర్మ ఆత్మహత్య కేసులో నిందితుడు. ఎండిఎల్ఆర్ మూతపడిన తర్వాత ఆమె గోవా కాసినోలో 2009లో చేరింది.

ఎయిర్ హోస్టెస్ ఎవరినీ గోపాల్ కందా తీసేయలేదని, వాళ్లు కాసినోలో పనిచేస్తున్నారని తాను చేరిన తర్వాత తెలిసి ఆశ్చర్యపోయానని నూపుర్ మెహతా అన్నది. కందాకు అత్యంత ముఖ్యమైన మిత్రులు, పరిచితులు ఉన్నారని, వారిలో అతి ముఖ్యమైన కాంగ్రెసు నాయకులు, వ్యాపారవేత్తలు కూడా ఉన్నారని, వారు కాసినోకు వచ్చేవారని ఆమె అన్నది.

నూపుర్ కథనం ప్రకారం - కందాతో వైవాహికేతర సంబంధం ఉన్నట్లు భావిస్తున్న అంకితతో గీతికకు వ్యక్తిగత విరోధం ఉంది. అంకితకు, కందాకు ఓ పాప ఉందని చెబుతారు. అంకితపై గీతిక కేసు కూడా పెట్టింది. తన సూసైడ్ నోట్‌లో గీతిక ఆశ్చర్యకరంగా అంకిత పేరును కూడా ప్రస్తావించింది.

గీతిక ఆత్మహత్య వ్యవహారంలో పోలీసులు ఎండిఎల్ఆర్ మరో ఉద్యోగి చాంద్ శివరూప్‌ను అరెస్టు చేశారు. శివరూప్ ఎండిఎల్ఆర్ హెచ్ఆర్ మేనేజర్. గీతిక శర్మపై శివరూప్ తప్పుడు ఆరోపణలు చేశారని, దుబాయ్ పంపించేస్తానని బెదిరించారని అంటారు. అయితే, గీతికా శర్మ కేసులో నూపుర్ మెహతా వాంగ్మూలం పలు విషయాలను వెల్లడించవచ్చునని పోలీసులు భావిస్తున్నారు.

English summary
Amid several controversies and criticism against them, Delhi police on Wednesday, Aug 22 stated that they would question Bollywood actress Nupur Mehta in connection with air hostess Geetika Sharma's suicide case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X