• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ట్రయాంగిల్: కందాను పెళ్లాడాలని గీతిక అనుకుందా?

By Pratap
|
Gopal Kanda-Geethika Sharma
న్యూఢిల్లీ: మాజీ ఎయిర్ హోస్టెస్ గీతికా శర్మ హర్యానా మాజీ మంత్రి గోపాల్ గోయల్ కందాను పెళ్లి చేసుకోవాలని అనుకుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకు ఉన్న అడ్డంకులను తొలగించుకోలేక తీవ్ర అసంతృప్తికి గురై ఆత్మహత్యకు పాల్పడిందనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ మేరకు పోలీసులకు కొన్ని విషయాలు తెలిసినట్లు చెబుతున్నారు. సరస్ శర్మతో విడాకులు తీసుకున్న తర్వాత కందాను పెళ్లి చేసుకోవాలని భావించిన గీతిక ముక్కోణపు ప్రేమలో గిలగిలలాడినట్లు చెబుతన్నారు.

అంకిత, గీతికలతో కందాకు వైవాహికేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. కందా భార్యకు ఈ విషయం తెలుసునని కూడా అంటున్నారు. భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత తాను కందాను వివాహం చేసుకుంటానని, అందువల్ల కందాను వదిలేయాలని గీతిక అంకితకు చెప్పినట్లు సమాచారం. గోవాలోని కందా కాసినోలో అంకిత డ్యాన్సర్‌గా పనిచేస్తోంది. ఈ విషయంపై బాలీవుడ్ నటి నూపుర్ మెహతాను ప్రశ్నించాలని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం.

కందాతో అంకితకు ఓ పాప కూడా ఉందని నూపుర్ మెహతా ఇంతకు ముందు చెప్పింది. ఎండిఎల్ఆర్‌ మాజీ ఉద్యోగిని అయిన వర్ధమాన తార నూపుర్ గోవా కాసినోలో కూడా పనిచేసింది. గీతికకు, అంకితకు మధ్య వ్యక్తిగత వివాదం ఉందని, అంకితపై గీతిక కేసు కూడా పెట్టిందని నూపుర్ చెప్పింది. అంకిత వల్ల కందాతో తన సంబంధం కొనసాగబోదనే భావనకు గీతిక గురైనట్లు మీడియా వార్తల వల్ల తెలుస్తోంది.

గీతికను తమ కూతురులాగా చూసుకునేవాళ్లమని కందా భార్య సరస్ చెప్పిన తర్వాత కూడా అటువంటి వార్తలు మీడియాలో వచ్చాయి. గీతికకు పలుమార్లు అబార్షన్ జరిగినట్లు అరుణ చద్దా అంతకు ముందు చెప్పారు. గీతికను అసజమైన లైంగిక క్రియకు గురి చేసినట్లు శవపరీక్షలో కూడా తేలింది. కందాను పోలీసులు అరెస్టు చేశారు. ఇటువంటి వార్తలపై వ్యాఖ్యానించే అవకాశం ఆయనకు లేకుండా పోయింది. ఆగస్టు 5వ తేదీన గీతికా శర్మ ఉరేసుకుని మరణించింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Delhi police during its investigation in the Geetika Sharma suicide case are believed to have found some information which may help them to bring down the conclusion. The investigators reported to have claimed that it could be a case of love triangle and that Geetika allegedly wanted to marry Gopal Kanda after his divorce with his wife Saras Kanda.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more