హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అస్సాం అల్లర్లు: ట్విట్టర్‌పై వేటు యోచనలో ప్రభుత్వం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Northeast exodus: Govt may take action against Twitter
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ ట్విట్టర్ పైన న్యాయపరమైన చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశ భద్రత వంటి కీలక అంశాల్లోనూ సహకరించడానికి నిరాకరిస్తున్న కొన్ని సోషల్ నెట్‌ వర్కింగ్ వెబ్‌సైట్లపై వేటుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.

అస్సాం అల్లర్ల నేపథ్యంలో వెల్లువెత్తుతున్న ఎస్సెమ్మెస్‌లు, ఎమ్మెమ్మెస్‌ల హెచ్చరిక సందేశాలను అదుపు చేయడంలో ట్విటర్ వంటి సోషల్ నెట్‌ వర్కింగ్ సైట్ల సాయాన్ని ప్రభుత్వం కోరింది. దీనిపై సరిగ్గా స్పందించని 254 వెబ్‌సైట్లను ఇప్పటికే స్తంభింప జేసిన ప్రభుత్వం, ట్విటర్‌నూ ఆ జాబితాలో చేర్చేయోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఈ మేరకు టెలికం శాఖకు కేంద్ర హోంశాఖ సూచించినట్టు సమాచారం. యూ ట్యూబ్, ఫేస్‌బుక్ తదితర సైట్లు కేంద్రం వినతిపై సానుకూలంగా స్పందించగా, ట్విటర్ మాత్రం ముందుకు రాలేదు. ట్విటర్‌లో పోస్టు అయిన 28 పేజీల విషయంలో కేంద్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కాగా ఇటీవల జరిగిన అస్సాం అల్లర్ల నేపథ్యంలో కర్నాటక, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలలోని ఈశాన్య రాష్ట్రవాసులు తరలి వెళ్లిన విషయం తెలిసిందే.

ఇందుకు కారణం ఎస్సెమ్మెస్‌లు, ఎమ్మెమ్మెస్‌లు పాక్ నుండి రావడమే కారణమని భావించిన కేంద్ర ప్రభుత్వం సోషల్ వర్కింగ్ సైట్లను పాక్ నుండి వచ్చే వాటిపై నియంత్రణ పాటించాలని సూచించాయి. కానీ కొన్నివెబ్ సైట్లు ప్రభుత్వం విజ్ఞప్తిని పట్టించుకోలేదు. దీంతో ఆయా సైట్ల పైన ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ట్విట్టర్ పైనా తీసుకునే అవకాశముంది.

English summary
The government has threatened to take legal action against social networking sites like Twitter who have refused to cooperate in the crackdown on web pages carrying inflammatory messages against Indians from the Northeast. Facebook and YouTube have already confirmed the government's suspicion that inflammatory messages were uploaded from Pakistan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X