హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టెక్కీ నీలిమ ఆత్మహత్య: విస్రాతో వీడిన చిక్కుముడి!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Neelima
హైదరాబాద్: ఇన్ఫోసిస్ సాఫ్టువేర్ ఉద్యోగిని నీలిమ అనుమానాస్పద మృతికి సంబంధించిన విస్రా నివేదిక గాంధీ ఆసుపత్రికి అందింది. నీలిమ శరీరంలో ఎలాంటి విషపూరిత రసాయనాలు లేవని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్) పరీక్షల్లో తేలిందని తెలుస్తోంది. అనుమానాస్పద స్థితిలో ఇన్ఫోసిస్ భవనం నుంచి కిందపడి మరణించిన నీలిమ మృతిపై బంధువులు, సన్నిహితులు పలు అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సైబరాబాద్ పోలీసులు ఆమె పంపిన మెయిల్స్, సెల్‌ఫోన్ నుంచి వెళ్లిన ఎస్సెమ్మెస్‌ల ఆధారంగా ఆత్మహత్యేనని ప్రకటించారు.

పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు నీలిమ అవయవాలను ఎఫ్ఎస్ఎల్‌కు పంపారు. పరీక్షలో భవనంపై నుంచి పడటం వల్ల తగిలిన గాయాలతోనే ఆమె మరణించినట్లు స్పష్టమైంది. నీలిమ చనిపోవడానికి ముందు ఆమె శరీరా భాగాలు సక్రమంగానే పని చేశాయని, ఎటువంటి విష లేదా మత్తు పదార్థాల ప్రయోగం జరగలేదని నిర్ధారించినట్లుగా తెలుస్తోంది. ఫోరెనిక్స్ నివేదికపై గాంధీ ఆసుపత్రి వైద్యులు గురువారం ఉదయం పదకొండు గంటలకు ప్రత్యేకంగా సమావేశమై అధ్యయనం చేసి తుది నివేదికను పోలీసులకు అందజేయనున్నారు.

కాగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇన్ఫోసిస్ ప్రాంగణంలో నీలిమ జూలై 31న రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. నీలిమ తన భర్తకు ఆఖరుగా మెయిల్ చేసింది. అందులో నీవు చాలా మంచివాడివని, నీ దారి వేరు... నా దారి వేరని, నీకు నాకు మ్యాచ్ కాలేదని, తనది సహజ మరణంగా భావించి, ఓ మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో అని, ఎవరితోనూ చెప్పవద్దని, పండూ తనకు ఫ్రెండ్ మాత్రమేనని, అతనిని ఈ జన్మలో కలవలేనని తన భర్త సురేష్‌కు పంపిన ఆఖరి మెయిల్‌లో నీలిమ పేర్కొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్యపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు.

English summary

 It is said that Forensic experts found in their postpartum report that Infosys software engineer Neelima has committed suicide. They said that there is no evidence to see the Neelima's death as a murder.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X