హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అస్సాం అల్లర్లు: బోడో ఎమ్మెల్యే ప్రదీప్ బ్రహ్మ అరెస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Assam MLA arrested for alleged involvement in violence
గౌహతి: అస్సాంలో చోటు చేసుకున్న అల్లర్లకు బాధ్యుడని అనుమానిస్తున్న ఓ శాసనసభ్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. అస్సాంలోని బోడో ప్రాంతాల్లో జరిగిన అల్లర్లకు సబంధించి బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ ఎమ్మెల్యే ప్రదీప్ బ్రహ్మను గురువారం అదుపులోకి తీసుకున్నారు. అల్లర్లకు సంబంధించి అతని పైన ఏడు కేసులు నమోదయ్యాయి. అల్లర్ల సమయంలో ప్రదీప్ బ్రహ్మ బోడోలకు మద్దతిచ్చినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు కోక్రాఝర్ వద్ద ప్రదీప్ బ్రహ్మను అరెస్టు చేశారు. కోక్రాఝర్‌లో పోలీసులు కర్ఫ్యూ విధించారు. కాగా అంతా ప్రశాంతంగా ఉందనుకుంటున్న సమయంలో బుధవారం అస్సాం మళ్లీ రగిలింది. ధుబ్రీ జిల్లాలో బుధవారం గుర్తు తెలియని సాయుధులు జరిపిన కాల్పులలో ఇద్దరు కూలీలు మృతిచెందారు.

పొలం పనులు చేస్తున్న కూలీల బృందంపై కొంతమంది తుపాకులతో దాడి చేశారు వారు తేరుకొని తప్పించుకునేసరికే ఇద్దరు కూలీలు తూటాలు తగిలి అక్కడికక్కడే మృతి చెందారు.దీంతో నెల రోజులుగా ఎడతెగకుండా కొనసాగుతున్న జాతి ఘర్షణలలో మృతి చెందిన వారి సంఖ్య 80కు చేరుకుంది. కర్ఫ్యూను తాత్కాలికంగా సడలించిన సమయంలోనే దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు.

English summary
The embers of the Assam violence still seem to be searing in certain parts of the state. Following this, an MLA from Assam has been arrested after suspected involvement in the Assam unrest. The MLA from the Bodoland people's Front, Pradeep Brahma was arrested by the Assam police and slapped with seven charges.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X