బాలీవుడ్ సినిమాల్లో నటించాలని ఉంది: సైనా నెహ్వాల్

Posted By:
Subscribe to Oneindia Telugu
Saina Nehwal
బెంగుళూరు, ఆగస్టు 23: బుధవారం బెంగుళూరులో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో లండన్ ఒలింపిక్స్ పతక విజేత బ్యాడ్మింటన్ స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ మాట్లాడుతూ బ్యాడ్మింటన్‌లో ఒలింపిక్ పతకం సాధించడం చాలా కష్టమైన విషయం. కారణం బ్యాడ్మింటన్‌లో చైనాదే అగ్రస్దానం. ఒకరు కాదు ఇద్దరు కాదు.. 9 నుండి 10 మంది వరకు వారే అగ్రస్దానంలో ఉంటారు. వారితో పోటీ ఎల్లప్పుడూ కష్టంగానే ఉంటుందని చెప్పింది.

ఇదే కార్యక్రమంలో మరో ప్రశ్నకు గాను బాలీవుడ్ సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఉన్నట్లు తెలిపింది. సైనా నెహ్వాల్‌తో పాటు ఈ కార్యక్రమంలో లండన్ ఒలింపిక్స్‌లో మహిళల బాక్సింగ్‌లో కాంస్య పతకం నెగ్గిన మేరీకామ్ కూడా పాల్గొంది. బంగారు పతకం కోసం తాను తీవ్రంగా ప్రయత్నించానని.. కానీ కాంస్యంతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని చెప్పింది.

2016 రియో ఒలింపిక్స్‌లో తప్పకుండా బంగారు పతకం సాధించేందుకు కృషి చేస్తానని మేరీకామ్ చెప్పింది. భారత్‌కు ఒలింపిక్ పతకం సాధించిన రెండో మహిళ సైనా. తొలి పతకం కూడా రాష్ట్రానికే చెందిన కరణం మల్లీశ్వరి (వెయిట్‌లిఫ్టింగ్) 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో గెలిచింది. ఒలంపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన మేరీ కామ్‌కు మణిపూర్ ప్రభుత్వం రూ.50 లక్షల నగదు ప్రోత్సహాకాన్ని ప్రకటించింది. అడిషనల్ ఎస్పీగా పదోన్నతితో పాటు.. మీటీ లాంగోల్ అనే ఊళ్లో రెండెకరాలు భూమిని కూడా ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

తెలుగు వన్ఇండియా

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
I was already a celebrity, but now I’ve become like a film star. Everyone wants to meet me. Everyone wants my autograph. I am thankful to everyone who has made me a champion. I want to win more medals for the country and I hope people will continue to support me.
Please Wait while comments are loading...