హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్టీఆర్ విగ్రహం: చంద్రబాబుపై యార్లగడ్డ విసుర్లు

By Pratap
|
Google Oneindia TeluguNews

Yarlagadda Lakshmi Prasad
న్యూఢిల్లీ: పార్లమెంటు ఆవరణలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు విగ్రహ స్థాపన విషయంలో హిందీ అకాడమీ చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సంచలన ప్రకటన చేశారు. పార్లమెంటు ఆవరణలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు విగ్రహాలను ఏర్పాటు చేయాలని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో డిమాండ్ చేశారు.

లోకసభ స్పీకర్‌గా బాలయోగి ఉన్న సమయంలో విగ్రహాల స్థాపనకు అనుమతి లభించినా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించలేదని ఆయన విమర్శించారు. ఎన్టీ రామారావు విగ్రహాన్ని పార్లమెంటు ఆవరణలో నెలకొల్పడం చంద్రబాబుకు ఇష్టం లేదని ఆయన వ్యాఖ్యానించారు.

పార్లమెంటు ఆవరణలో ఎన్టీ రామరావు విగ్రహాన్ని స్థాపించాలని చంద్రబాబు ఆ తర్వాత లేఖలు కూడా రాయలేదని ఆయన అన్నారు. కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి పలుమార్లు లేఖలు రాసినట్లు ఆయన తెలిపారు. తనకు రాజకీయ ఉద్దేశాలు లేవని ఆయన అన్నారు. ఎన్టీ రామరావు విగ్రహం పార్లమెంటులో ఉండాలన్నదే తన ఉద్దేశమని ఆయన అన్నారు.

ఎన్టీ రామారావు విగ్రహ స్థాపనపై లోకసభకు చంద్రబాబు నుంచి ఒక లేఖ కూడా లేదని ఆయన అన్నారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి భర్త, కాంగ్రెసు శానససభ్యుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావుకు సన్నిహితులు. మొదటి నుంచి ఆయన ఎన్టీ రామరావుకు సన్నిహితంగా ఉంటూ వచ్చారు. ఎన్టీ రామారావు నుంచి అధికార మార్పిడి జరిగిన తర్వాత ఆయన దగ్గుబాటి వెంట ఉన్నారు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు.

English summary
Hindi Academy chairman Yarlagadda Laxmiprasad criticized Telugudesam party president N Chandrababu Naidu on the installation of NT Ramarao statue in Parliament premises. He said that Chandrababu has no interest on that.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X