వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ పార్టీలోకి కాంగ్రెసు సీనియర్ నేత ఉప్పునూతల

By Pratap
|
Google Oneindia TeluguNews

Uppunuthala Purushotham Reddy
నల్లగొండ: కాంగ్రెసు సీనియర్ నాయకుడు ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఆయన గురువారంనాడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పాలక మండలి సభ్యుడు వైవీ సుబ్బారెడ్డితో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై వారిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తాను వైయస్సార్ కాంగ్రెసులో చేరుతున్నట్లు ఉప్పునూతల నేడో రేపో ప్రకటించే అవకాశం ఉంది.

నల్లగొండ జిల్లాకు చెందిన ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి కాంగ్రెసు పార్టీలో పలు కీలక పదవులు చేపట్టారు. ఆయన జిల్లాలో మంచి పట్టు ఉంది. కాంగ్రెసు పార్టీలో ఆయన చాలా కాలంగా అసంతృప్తితో ఉన్నారు. జిల్లా రాజకీయాలు కూడా ఆయన ప్రతికూలంగా మారాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెసు పార్టీకి జిల్లాలో కీలకం కావడంతో ఆయన ప్రాధాన్యం తగ్గుతూ వచ్చింది.

దానికితోడు, తన సమకాలీనుడైన పాల్వాయి గోవర్ధన్ రెడ్డికి రాజ్యసభ పదవిని కట్టబెట్టిన కాంగ్రెసు అధిష్టానం ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డిని అసలు పట్టించుకోలేదు. దాంతో ఆయన మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. పైగా, సీనియర్ మంత్రి కె. జానా రెడ్డి కూడా జిల్లాలో కీలకంగా మారారు. దీంతో కాంగ్రెసులో ఉంటే తనకు భవిష్యత్తు లేదనే నిర్ణయానికి ఆయన వచ్చినట్లు చెబుతున్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో కూడా ఆయనకు పెద్దగా గుర్తింపు లభించలేదు. ఆయన తెలంగాణ ప్రాంతీయ మండలి చైర్మన్‌గా నియమించారు. కానీ అది పనిచేసిన పాపాన పోలేదు. వైయస్ రాజశేఖఱ రెడ్డిపై ఆయన నిరంతరం సమరం చేస్తూ వచ్చారు.

English summary
It is said that Congress senior leader Uppunuthala Purushotham Reddy may jump into YS Jagan's YSR Congress party. He held siscussions with YSR Congress party leader YV Subba Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X