హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబుతో కటీఫ్: వైయస్ జగన్‌తో సిపిఎం దోస్తీ?

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan-Chandrababu Naidu
హైదరాబాద్: రాష్ట్రంలో పొత్తులకు సంబంధించి సిపిఎం ఓ స్పష్టమైన అవగాహనకు వచ్చినట్లు అర్థమవుతోంది. పాత మిత్రుడైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో పూర్తిగా తెగదెంపులు చేసుకున్నట్లేనని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో ఒక అవగాహనకు రావాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో పొత్తు పెట్టుకోకుండా సీట్ల సర్దుబాటు చేసుకునేందుకు ఓ అవగాహనకు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

ఇదిలావుంటే, సోదర వామపక్షం సిపిఐతో కూడా ఎన్నికల్లో సిపిఎం నడిచే అవకాశాలు లేనట్లే కనిపిస్తోంది. సిపిఐ తెలుగుదేశం పార్టీకి పూర్తిగా దగ్గరైంది. శనివారం విజయవాడలో తెలుగుదేశం పార్టీతో కలిసి సిపిఐ మహా ధర్నాకు దిగింది. కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ తెలుగుదేశం పార్టీతో కలిసి మహా ధర్నాకు దిగింది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కూడా సిపిఐ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చింది. సిపిఎం మాత్రం ఒంటరిగా పోటీ చేసింది.

తెలంగాణలో సిపిఐ కె. చంద్రశేఖర రావు నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితితో కలిసి పనిచేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుకు అటు తెలుగుదేశం పార్టీతోనూ ఇటు తెరాసతోనూ సిపిఐ సిద్ధపడవచ్చు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్న సిపిఎం తెరాసతో దోస్తీ కట్టే అవకాశాలు ఏ మాత్రం లేవు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి కూడా సిపిఎం పూర్తిగా దూరమైనట్లేనని భావిస్తున్నారు.

శనివారం మీడియా సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి విజయవాడలో చేసిన వ్యాఖ్యలు కూడా అదే విషయాన్ని తెలియజేస్తున్నాయి. తెలుగుదేశం, సిపిఐలది అవకాశవాద రాజకీయమని ఆయన ఆ పార్టీలు చేపట్టిన మహాధర్నాపై వ్యాఖ్యానించారు. నీరు విడుదల చేయకూడదన్న పార్టీలే ఇప్పుడు నీటి విడుదల కోసం ఆందోళన చేస్తున్నాయని కూడా ఆయన విమర్శించారు. దీన్ని బట్టి సిపిఎం ఆ రెండు పార్టీలకు పూర్తిగా దూరం జరిగేందుకు మానసికంగా సిద్ధపడినట్లు చెబుతున్నారు.

ఢిల్లీ పీఠంపై యుద్ధం చేస్తున్నారని చెప్పి సిపిఎం వైయస్ జగన్‌తో కలిసి పనిచేయడానికి సిపిఎం సిద్ధపడుతుందని అంటున్నారు. పెద్ద శత్రువును ఎదుర్కోవడానికి ఆ శత్రువుపై పోరాటం చేస్తున్న చిన్న శత్రువుతో కలిసి పనిచేయడానికి సిపిఎం సిద్ధపడుతుందని అంటున్నారు. చాలా కాలంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో కలిసి పని చేసే విషయంపై సిపిఎంలో తర్జనభర్జనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

English summary
It is learnt that CPM has not interested make alliance with Chandrababu Naidu's Telugudesam party. It is looking towards YS Jagan's YSR Congress, it is said. CPM secretary BV Raghavulu's latest statement indicates the same.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X