హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రభుత్వంపై ఎదురు తిరిగిన ఇంజనీరింగ్ కళాశాలలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Private Engineering Colleges
హైదరాబాద్: ఏడాదికి 35 వేల రూపాయల ఫీజులకు అంగీకరిస్తూ అండర్ టేకింగ్ ఇచ్చిన ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు ప్రభుత్వంపై ఎదురు తిరిగాయి. తమ అండర్ టేకింగులను వెనక్కి తీసుకుంటామని హెచ్చరించాయి. కొన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల యజమానులు శనివారం సమావేశమై ఫీజుల వ్యవహారంపై చర్చించారు. రేపు ఆదివారం సర్వసభ్య సమావేశం నిర్వహించాలని వారు నిర్ణయించుకున్నారు.

ప్రభుత్వం తమ నుంచి బలవంతంగా అండర్ టేకింగ్‌లు తీసుకుందని యాజమన్యాలు విమర్సించాయి. టాస్క్‌ఫోర్స్ దాడులకు భయపడేది లేదని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల యజమానులు అన్నారు. తమ కళాశాలలకు కూడా వార్షిక ఫీజును 50,200 రూపాయలు ఇవ్వాల్సిందేనని అన్నారు. అండర్ టేకింగ్‌లు ఇవ్వకుండా కోర్టుకు వెళ్లిన యాజమాన్యాలకు 50,200 రూపాయల ఫీజు నిర్ణయించినట్లు వారు తెలిపారు.

తమను ప్రభుత్వం నిండా ముంచిందని వారు విమర్శించారు. ఏకీకృత ఫీజునే అమలు చేయాలని, మూడు రకాల ఫీజులు సరి కాదని వారన్నారు. విద్యాసంవత్సరాన్ని విద్యార్తులు నష్టపోకూడదనే ఉద్దేశంతోనే తాము 35 వేల రూపాయల ఫీజుకు అప్పుడు అంగీకరించామని వారు చెప్పారు. అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని, ఈ విషయమై ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహను కలుస్తామని వారు చెప్పారు.

ఇంజనీరింగ్ కళాశాలలు కొన్ని ప్రభుత్వం నిర్ణయించిన 35 రూపాయల ఫీజుకు అంగీకరిస్తూ అండర్ టేకింగులు ఇచ్చాయి. కొన్ని కళాశాలలు మాత్రం కోర్టుకు వెళ్లాయి. దీంతో సమస్య జటిలంగా మారింది. ఫీజులను 35 వేల రూపాయలకు మించి నిర్ణయించేది లేదని ప్రభుత్వం పట్టుబడుతూ వస్తోంది.

English summary
Managements of private engineering colleges, who gave under taking accepting for Rs 35 thousand annual fee, have revolted against Government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X