వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాపై రాజకీయ కుట్ర: గీతిక ఆత్మహత్య కేసుపై కందా

By Pratap
|
Google Oneindia TeluguNews

Gopal Kanda
న్యూఢిల్లీ: మాజీ ఎయిర్ హోస్టెస్ గీతికా శర్మ ఆత్మహత్యతో తనకు ఏ విధమైన సంబంధం లేదని, తాను నిర్దోషినని హర్యానా మాజీ మంత్రి గోపాల్ గోయల్ కందా అన్నారు. తాను నిర్దోషినని ఆయన చెప్పారు. గీతికా శర్మ ఆత్మహత్య కేసులో అరెస్టయిన ఆయన శనివారం ఆ విధంగా అన్నారు. కొంత మంది రాజకీయ నాయకులు తనపై బురద చల్లుతున్నారని ఆయన అన్నారు. వారు మీడియాను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు.

కందా పోలీసు కస్టడీ శనివారంతో ముగిసింది. దీంతో ఆయనను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సమయంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. గీతికా శర్మ ఆత్మహత్య కేసులో ఆయన 11 రోజుల పాటు పరారీలో ఉన్నారు. గీతికా శర్మ ఆగస్టు 5వ తేదీన ఆత్మహత్య చేసుకుంది. దానికి ముందు రాసి పెట్టిన సూసైడ్ నోట్‌లో ఆమె కందాపై, ఆయన ఉద్యోగిని అరుణా చద్ధాపై ఆరోపణలు చేసింది.

తనపై వచ్చిన ఆరోపణలను కందా ఖండించారని, ఆత్మహత్య చేసుకోవడానికి ముందు 45 రోజులు ఆమెను తాను కలుసుకోలేదని కందా చెప్పినట్లు పోలీసులు అన్నారు. అరుణా చద్దానే గీతిక తల్లిదండ్రులను పిలిచి, ఉద్యోగంలో గీతికను చేర్పించాలని అడిగినట్లు కందా చెప్పారు .

కందాను పెళ్లి చేసుకున్నట్లు చెబుతున్న అంకితా సింగ్‌ను కూడా ప్రశ్నించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆమె ప్రస్తుతం సింగపూర్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అంకితకు, గీతికకు మధ్య గొడవ జరిగినట్లు, ఆ గోడవ కారణంగా అంకితపై గీతిక కేసు పెట్టినట్లు పోలీసులు కనిపెట్టారు. అప్పట్లో దీనిపై పానాజీ పోలీసులు అంకితను ప్రశ్నించినట్లు కూడా చెబుతున్నారు.

English summary
Former Haryana minister Gopal Kanda, arrested in connection with the suicide of his former employee, on Saturday claimed innocence and said he was a victim of a conspiracy. "Some politicians are doing this to malign me. They are misguiding media. Truth will come out," Kanda told reporters before being taken to court as his police remand ended on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X