వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ దోపిడీలో మంత్రుల భాగస్వామ్యం: ఎర్రన్నాయుడు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Yerrannaidu
జయవాడ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి దోపిడీలో మంత్రులకు భాగస్వామ్యముందని తెలుగుదేశం పార్టీ నేత ఎర్రన్నాయుడు ఆదివారం అన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి ధర్మాన ప్రసాద రావును ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు వెనుకేసుకొస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ధర్మానకు మంత్రులు అందరూ మద్దతుగా నిలవడం శోచనీయమన్నారు.

మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణను జైలులో ఉంచిన ప్రభుత్వం ధర్మాన విషయంలో ఎందుకు వెనక్కి వెళుతున్నారని ప్రశ్నించారు. జగన్ దోపిడీలో మంత్రుల బాధ్యత ఖచ్చితంగా ఉందని, వారు చట్ట ప్రకారం శిక్షార్హులని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వెంటనే ధర్మాన ప్రసాద రాజీనామాను ఆమోదించాలని డిమాండ్ చేశారు. వారి ఇష్టం వచ్చినట్లుగా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెసు కంపెనీ ఏమీ కాదని ఎద్దేవా చేశారు.

అవినీతిలో కాంగ్రెసు ప్రభుత్వానికి గిన్నిస్ రికార్డ్ వస్తుందన్నారు. ధర్మానను అరెస్టు చేయక పోవడానికి గల కారణాలు వెంటనే తెలియజేయాలన్నారు. అవినీతి మంత్రులను సమర్థిస్తే ముఖ్యమంత్రి కూడా కోర్టు ఎదుట నిల్చోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ బొగ్గు కుంభకోణానికి బాధ్యత వహించాలని సూచించారు. ఈ కుంభకోణంపై కేంద్రం పార్లమెంటులో సంజాయిషీ ఇవ్వాల్సిందేనని చెప్పారు.

బిసి రిజర్వేషన్లను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాజకీయం చేస్తోందని మరో నేత దేవేందర్ గౌడ్ హైదరాబాదులో అన్నారు. బిసిలపై ఆ పార్టీది కపడ ప్రేమ అని, బిసిలను జగన్ పార్టీ గందరగోళ పరుస్తోందని మండిపడ్డారు. లాటరీలో బిసిలకు టిక్కెట్లు అనేది అర్థంపర్థం లేని ప్రతిపాదన అన్నారు. బోధనా రుసుములపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

English summary
Telugudesam Party senior leader Errannaidu said that minister are in YSR Congress party chief and YS Jaganmohan Reddy's assets case row.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X