వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని దొరికిపోయారు, తప్పు ఒప్పుకున్నారు: నామా

By Pratap
|
Google Oneindia TeluguNews

Nama Nageswara Rao
న్యూఢిల్లీ: పార్లమెంటులో ప్రకటన ద్వారా ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్ తప్పులు ఒప్పుకుని, దొరికిపోయారని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు నామా నాగేశ్వరరావు అన్నారు. బొగ్గు గనులను కాంపిటీటివ్ బిడ్డింగ్ ద్వారా విక్రయించాలని 2004లోనే నిర్ణయం తీసుకున్నామని చెప్పిన ప్రధాని దానికి అడ్డుపడింది ఎవరో కూడా సమాధానం ఇవ్వాలని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తర్వాత బొగ్గు శాఖ ప్రధాని చేతిలోకే వచ్చిందని గుర్తు చేస్తూ అయినప్పటికీ ప్రధాని కాంపిటీటివ్ బిడ్డింగ్ ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. దీన్ని బట్టి వేలానికి ఒప్పుకోంది ప్రధానేనా? అన్న అనుమానం అందరిలోనూ వ్యక్తమవుతోందన్నారు. పైగా, ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరుగుతోందని, తప్పు చేసిన వారిపైనా విచారణ జరుపుతామని చెప్పిన ప్రధాని తప్పులు జరిగాయని కూడా ఒప్పుకున్నట్లు అయ్యిందన్నారు.

సహజవనరుల కేటాయింపు కేంద్ర ప్రభుత్వం చేతిలోని విషయమని, అలాంటిది కొన్ని రాష్ట్రాలను అడ్డం పెట్టుకుని ఈ కుంభకోణం నుంచి తప్పించుకోవాలని కేంద్రం భావిస్తోందని విమర్శించారు. బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించటంలో ఇటు కేంద్రం, అటు ప్రధాని పూర్తిగా విఫలమయ్యారని, తమ తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకు నాయకులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. గనుల కేటాయింపులో ఎలాంటి నష్టం లేదని ఆర్థిక మంత్రి, కాగ్‌వి కాకిలెక్కలని బొగ్గు శాఖ మంత్రి చెబుతుంటే మొత్తంగా కాగ్ నివేదికనే ప్రధాని తప్పు పట్టడం ఆశ్చర్యంగా ఉందన్నారు.

రాజ్యాంగ సంస్థ అయిన కాగ్‌ను తప్పు పడుతున్నారంటే, రాజ్యాంగంపైన ప్రధానికి నమ్మకం లేదన్న అనుమానాలు వ్యక్తమవుతాయని అన్నారు. కేంద్రాన్ని తప్పు పడుతున్నాయని ఆయన అన్నారు. ఇలాంటి రాజ్యాంగ వ్యవస్థల్ని రద్దు చేస్తారా? అని ప్రశ్నించారు. రూ. 3.78 లక్షల కోట్ల విలువైన కుంభకోణాలను బయటపెట్టిన కాగ్‌ను తప్పుపట్టడం సరికాదన్నారు. తక్షణం బొగ్గు కేటాయింపుల్ని రద్దు చేయాలని, తర్వాతే పార్లమెంటులో చర్చించాలని డిమాండ్ చేశారు. బొగ్గు గనులను అంతర్జాతీయ వేలం ద్వారా విక్రయించాలని, అప్పుడు కాగ్ చెప్పిన నష్టం కంటే ఎక్కువ లాభం వస్తుందని తెలిపారు.

బొగ్గు గనుల కుంభకోణంలో బాధ్యుడై కూడా తప్పును ఒప్పుకోని ప్రధాని మన్మోహన్‌సింగ్ కంటే జగన్ అక్రమాస్తుల కేసులో నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన రాష్ట్ర మంత్రి ధర్మాన ప్రసాదరావే మేలని టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి అన్నారు. మంత్రి రాజీనామా చేసినప్పుడు రాజ్యాంగాన్ని అనుసరించి దాన్ని ఆమోదించటమో, తిరస్కరించటమో చేయాల్సిన ముఖ్యమంత్రి రాజ్యాంగాన్నే ఉల్లంఘిస్తున్నారని ఆయన తప్పు పట్టారు. రాష్ట్రంలో అసలు రోడ్లు, భవనాల శాఖకు మంత్రి ఉన్నారా? లేరా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఖరి గర్హనీయమని, వెంటనే ఆయన స్పందిచాలని డిమాండ్ చేశారు.

English summary
Telugudesam MP Nama Nageswar Rao lashed out at PM Manmohan Singh on coalgate scam. He said Manmohan singh has accepted his fault on allocation of coal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X