వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సింగ్‌తో లక్ష్మీనారాయణ భేటీ: జగన్ కేసు పురోగతి పైనే!

By Srinivas
|
Google Oneindia TeluguNews

CBI JD Laxmi Narayana
న్యూఢిల్లీ: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ మంగళవారం ఉదయం ఢిల్లీకి వచ్చారు. ఆయన సిబిఐ డైరెక్టర్ ఎపి సింగ్‌తో భేటీ అయ్యారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు పురోగతిపై లక్ష్మీ నారాయణ డైరెక్టర్ సింగ్‌తో చర్చించినట్లుగా సమాచారం. ఇప్పటికే జగన్ కేసులో సిబిఐ నాలుగు ఛార్జీషీట్లు దాఖలు చేసింది. మరికొన్ని దాఖలు చేయడానికి సిద్ధంగా ఉంది. వీటన్నింటినీ సింగ్‌కు జెడి వివరించారని సమాచారం.

కాగా జగన్ ఆస్తుల కేసులో అరెస్టైన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సిబిఐ కోర్టులో దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై వాదనలు సోమవారం వాయిదా పడ్డాయి. తమ లాయర్లు అందుబాటులో లేరని, సమయం కావాలని డిఫెన్స్ కోరడంతో కేసు వాయిదా పడింది.

బెయిల్ డీల్ కేసులో వాదనలు వాయిదా

మరోవైపు కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ డీల్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ల వాదనలు వాయిదాపడ్డాయి. ఈ కేసులో మాజీ జడ్జి పట్టాభి రామారావు మూడోసారి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌తో పాటు కంప్లి ఎమ్మెల్యే సురేష్‌బాబు, దశరథరామి రెడ్డి పిటిషన్లపై సోమవారం వాదనలు జరిగాయి. డిఫెన్స్ వారి వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఎసిబి తరపు న్యాయవాదికి సూచిస్తూ తదుపరి వాదనలను మంగళవారానికి వాయిదా వేశారు.

ప్రత్యేక ఖైదీలుగా పరిగణించాలంటూ సోమ శేఖర రెడ్డి, సురేష్ బాబు వేసిన పిటిషన్లను న్యాయమూర్తి డిస్మిస్ చేశారు. గాలి బెయిల్ డీల్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న నాచారం రౌడీషీటర్ యాదగిరి రావు మొదటిసారిగా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఇప్పటికే డిఫెన్స్, ఎసిబి వాదనలు పూర్తయిన పట్టాభి కుమారుడు రవిచంద్ర, మాజీ న్యాయమూర్తి చలపతి రావు బెయిల్ పిటిషన్లపై తీర్పు మరోమారు వాయిదా పడింది.

English summary
CBI JD Laxmi Narayana was met CBI director AP Singh in New Delhi on Tuesday. Laxmi Narayana told him about YS Jaganmohan Reddy's assets case progress.ో
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X