వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌ను అడ్డుకోవడానికే కక్ష రాజకీయాలు: భారతి రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Bharathi
న్యూఢిల్లీ/హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ తమ కుటుంబంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైయస్ భారతీ రెడ్డి మంగళవారం అన్నారు. మధ్యంతర ఎన్నికల సర్వే ఫలితాలపై ఎన్డీటివి చర్చా కార్యక్రమంలో వైయస్ భారతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.

తమ కుటుంబంపై కాంగ్రెసు కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటోందని, ఇలా ఎందుకు చేస్తోందని ఆమె ప్రశ్నించారు. వైయస్సార్ కుమారుడు, తన భర్త వైయస్ జగన్‌ను అడ్డుకోవడానికే కాంగ్రెసు ఇలా చేస్తోందన్నారు. ప్రజలకు మంచి చేశారు కాబట్టే వైయస్ 2009లో పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకు వచ్చి, ముఖ్యమంత్రి కాగలిగారన్నారు. జగన్‌ను అడ్డుకోవడానికి టెర్రర్ సృష్టించడం బాధాకరమన్నారు.

కాగా రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి హవా కొనసాగుతోందని, జగన్‌ను 48 శాతం మంది ప్రజలు ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నట్లు ఎన్డీటివీ తాజా సర్వేలో వెల్లడైన విషయం తెలిసిందే. ఎన్డీటివీ 18 రాష్ట్రాల్లోని 125 నియోజకవర్గాల్లో ఓ స్వతంత్ర సంస్థతో సర్వే చేయించింది. 2009 వోటింగ్ సరళి ఆధారంగా ఈ సర్వే జరిగింది. ప్రతి లోకసభ నియోజకవర్గంలో రెండు, మూడు అసెంబ్లీ సెగ్మెంట్లను తీసుకుని సర్వే నిర్వహించినట్లు ఎన్డీటీవి తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో చేసిన సర్వే ఫలితాలను ఎన్డీటీవీ సోమవారం వెల్లడించింది.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని 17 శాతం మంది, ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని 11 శాతం మంది, చిరంజీవిని 6 శాతం మంది ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నట్లు తేలింది. ఆశ్చర్యకరంగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును 17 శాతం మంది ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నట్లు తేలింది. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వైయస్ జగన్ స్వీప్ చేస్తారని సర్వేలో తేలగా తెలంగాణలో కెసిఆర్ హవా కొనసాగుతుందని వెల్లడైంది. తెలంగాణలో జగన్‌ను ముఖ్యమంత్రిగా 19 శాతం మంది మాత్రమే కోరుకుంటున్నారు. 43 శాతం మంది కెసిఆర్‌ను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు. సీమాంధ్రలో 4 శాతం మంది కెసిఆర్‌ను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నట్లు సర్వేలోతేలింది.

ఇప్పటికిప్పుడు మధ్యంతర ఎన్నికలు వస్తే తెలుగుదేశం పరిస్థితి దారుణంగా ఉంటుందని సర్వేలో తేలింది. తెలుగుదేశం పార్టీ కన్నా కాంగ్రెసు పరిస్థితి కాస్తా మెరుగ్గా ఉంది. లోకసభ సీట్లలో 21 వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, 10 సీట్లు తెరాస, 9 సీట్లు కాంగ్రెసుకు వస్తాయని సర్వేలో తేలింది. ఇతరులు రెండు సీట్లు గెలుస్తారని సర్వేలో తేలింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని ఈ ప్రాంతంలో 86 శాతం మంది చెప్పగా, తెలంగాణేతర ప్రాంత ప్రజల్లో 24 శాతం మంది తెలంగాణకు అనుకూలంగా ఓటేశారు. వైయస్ జగన్‌పై కేసులు న్యాయసమ్మతమేనని తెలంగాణలో 74 శాతం మంది అభిప్రాయపడగా, తెలంగాణేతర ప్రాంతంలో 44 శాతం మంది అభిప్రాయపడ్డారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే జగన్‌పై కేసులు పెట్టారని తెలంగాణలో 26 శాతం మంది, సీమాంధ్రలో 56 శాతం మంది అభిప్రాయపడ్డారు.

అవినీతి ఎన్నికల అంశం కాదని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. ఎందుకంటే అన్ని పార్టీలు అవినీతిమయమేనని చెప్పారు. కాంగ్రెసు ఎక్కువ అవినీతికరమైన పార్టీ అని 54 శాతం మంది అభిప్రాయపడగా, బిజెపి అత్యంత అవినీతికరమైన పార్టీ అని 46 శాతం మంది అభిప్రాయపడ్డారు. రాజస్థాన్, ఒరిస్సా, మధ్యప్రదేశ్ రాష్టాల్లో కాంగ్రెసు అవినీతికి ఎక్కువగా పాల్పడిందని చెప్పగా, కర్ణాటకలో బిజెపి అత్యంత ఎక్కువ అవినీతికి పాల్పడిన పార్టీ అని 56 శాతం మంది అభిప్రాయపడ్డారు.

English summary

 YSR Congress party chief and Kadapa MP YS Jaganmohan Reddy's wife Bharati Reddy has blamed that Congress making factional politics to obstruct YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X