వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గీతికా శర్మ ఫోన్ దొరికింది: మెసేజ్ క్లూస్ దొరకొచ్చు

By Pratap
|
Google Oneindia TeluguNews

Geetika Sharma
న్యూఢిల్లీ: ఆత్మహత్య చేసుకుని మాజీ ఎయిర్ హోస్టెస్ గీతికా శర్మ ఫోన్ పోలీసులకు చిక్కింది. గుర్గావ్‌లోని ఎండిఎల్ఆర్ కార్యాలయంలో గీతికా శర్మ అధికారిక సెల్ ఫోన్ తమకు లభించిందని పోలీసులు చెప్పారు. గీతికా శర్మ, హర్యానా మాజీ మంత్రి గోపాల్ గోయల్ కందా, ఆయన మేనేజర్ అరుణా చద్దా మధ్య ఎస్ఎంఎస్ సందేశాల వివరాలు ఈ సెల్ ఫోన్ ద్వారా లభించవచ్చునని పోలీసులు అంటున్నారు.

కందా మూడు రోజుల పోలీసు కస్టడీ మంగళవారంతో ముగిసింది. అయితే, ఇప్పటి వరకు కందా భార్యగా చెబుతున్న వర్ధమాన నటి అంకితా సింగ్‌ను పోలీసులు ఇప్పటి వరకు ప్రశ్నించలేదు. ఆమె సింగపూర్‌ నుంచి తిరిగి వచ్చింది. తన సూసైడ్ నోట్‌లో గీతికా శర్మ అంకితా సింగ్ పేరును కూడా ప్రస్తావించింది. గీతికా గైర్హాజరీలో కందా ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు ఆధారాలున్నాయని పోలీసులు అంటున్నారు.

కందా దర్యాప్తులో గీతికా శర్మ ఫ్రెండ్ నావికా దళ కెప్టెన్ గురించి ప్రస్తావించారని, అతని పాత్రపై కూడా తాము దర్యాప్తు చేశామని, ఈ కేసుతో అతనికి ఏ విధమైన సంబంధం లేదని, కేసును తప్పు దారి పట్టించడానికి కందా ఆ పేరు చెప్పారని పోలీసులు అంటున్నారు. సోమవారంనాడు గీతికా శర్మ తల్లిని పోలీసులు మరోసారి ప్రశ్నించారు.

ఇదిలావుంటే, గుర్గావ్‌లో తనకు కందా ఫ్లాట్ కొనిచ్చినట్లు వచ్చిన వార్తలను వర్ధమాన నటి నూపుర్ మెహతా ఖండించారు. గోవాలోని ఎండిఎల్ఆర్‌లో తాను 2009లో ఉద్యోగం వదిలేశానని ఆమె చెప్పారు. తనకు గుర్గావ్‌తో ఏ విధమైన సంబంధం లేదని ఆమె అన్నారు. కందాకు ఆశ్రయం ఇచ్చిన సర్పంచ్‌పై కేసు పెట్టడానికి పోలీసులు సిద్ధపడుతున్నారు. గీతికా, అంకితలకు మధ్య గొడవ విషయంలో సమాచారం ఇవ్వగలిగే ఓ వ్యాపారవేత్తను తాము గుర్తించినట్లు పోలీసులు చెప్పారు.

English summary
Running out of time to question Sirsa MLA Gopal Goyal Kanda in the Geetika Sharma suicide case, police on Monday claimed they had recovered Geetika's official cell phone from his MDLR office in Gurgaon. This phone, sources say, is crucial for completing the SMS trail between Geetika, Kanda, and his manager Aruna Chaddha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X