హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ కేసు సంక్లిష్టమైంది, నిమ్మగడ్డకు నో బెయిల్

By Pratap
|
Google Oneindia TeluguNews

Nimmagadda Prasad
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ అక్రమాస్తుల కేసు సంక్లిష్టమైనదని, ఇందులో పలు అంశాలు ముడిపడి ఉన్నాయని సిబిఐ కోర్టు వ్యాఖ్యానించింది. దీన్ని లోతుగా విచారణ జరపాలనే సీబీఐ వాదనతో ఏకీభవిస్తూ ఈ కేసులో నిందితుడు నిమ్మగడ్డ ప్రసాద్‌కు బెయిల్ నిరాకరించింది.

వైయస్ జగన్ సంస్థల్లోకి పెట్టుబడుల ప్రవాహంపై దర్యాప్తు కొనసాగుతోందని, దీనిపై నిమ్మగడ్డ సంస్థల ఉద్యోగులను ఇంకా ప్రశ్నించాలని, ఈ దశలో బెయిల్ ఇవ్వరాదని సీబీఐ వాదించింది. మైటాస్ నుంచి రూ.20 కోట్లు, ఇందు ప్రాజెక్ట్స్ నుంచి రూ.70 కోట్లను జగన్ సంస్థల్లోకి మళ్లించడంలో నిమ్మగడ్డ కీలక పాత్ర పోషించారని కోర్టుకు తెలిపింది.

ఈ అంశాలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ దశలో నిందితుడికి బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఇదే కేసులో నిందితుడైన ఐఆర్ఎస్ అధికారి బ్రహ్మానంద రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణను వచ్చే నెల 4కు వాయిదా వేసింది. కాగా, ఎమ్మార్ కేసులో నిందితుడు, ఐఏఎస్ బి.పి.ఆచార్య బెయిల్ పిటిషన్‌పై వాదనలు కూడా 31కి వాయిదా పడ్డాయి.

వాన్‌పిక్‌కు భూముల కేటాయింపులో అక్రమాలు జరిగాయని సిపిఐ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిమ్మగడ్డ ప్రసాద్ అలియాస్ మ్యాట్రిక్స్ ప్రసాద్‌ను సిబిఐ అరెస్టు చేసింది. ఇదే కేసులో ప్రభుత్వాధికారి బ్రహ్మానంద రెడ్డిని, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణను కూడా సిబిఐ అరెస్టు చేసింది.

English summary
Court has rejected industrialist nimmagadda Prasad's bail petition in YSR Congress president YS Jagan DA case. The investigation is at critical stage, CBI court commented.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X