వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్డీటివి సర్వే: విహెచ్ నిప్పులు, జగన్ గుట్టు రట్టయింది

By Srinivas
|
Google Oneindia TeluguNews

V Hanumanth Rao
న్యూఢిల్లీ: తన తండ్రి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో అక్రమాలతో కోట్లాది రూపాయలు సంపాదించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి జాతీయ మీడియా మద్దతివ్వడం దారుణమని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు బుధవారం మండిపడ్డారు. తెలుగు మీడియాతో మాట మాత్రమైనా మాట్లాడని వైయస్ జగన్ జాతీయ మీడియాలో మాత్రం వారానికొకసారి ఇంటర్వ్యూలు ఇవ్వటం వెనుక గుట్టు రట్టయ్యిందని ఆయన అన్నారు.

జాతీయ మీడియా సంస్థతో రూ.20-30 కోట్ల ఒప్పందం కుదుర్చుకోబట్టే జగన్‌కు జాతీయస్థాయిలో ప్రచారం లభిస్తోందని చెప్పారు. బొగ్గు కేటాయింపులపై వచ్చిన ఆరోపణల ఆధారంగా మన్మోహన్ సింగ్ సర్కారుపై దుష్ప్రచారం చేస్తున్న జాతీయ మీడియా సంస్థలు... అక్రమార్జనపరుడైన జగన్‌కు మద్దతు పలకడం ఏమాత్రం నైతికం కాదన్నారు. ఎన్టీటివి చేసిన సర్వే సరికాదన్నారు. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగానే సర్వేలు చేసి ఎవరికి మేలు చేకూర్చాలనుకున్నారని ప్రశ్నించారు.

సాక్షి టివికి ఎడిటోరియల్ సహకారం అందిస్తున్న ఎన్డీటివికి జగన్ యేటా రూ.30 కోట్లు ఇస్తున్నారని ఆరోపించారు. దీనికి సంబంధించి వివిధ ఆంగ్లపత్రికలలో వచ్చిన కథనాలు మీడియాకు విడుదల చేశారు. ఆ సంబంధంతోనే జైల్లో ఉన్న జగన్‌కు మద్దతుగా ఎన్డీటివి సర్వే చేసిందన్నారు. 2004లో జాతీయ మీడియా ఛానళ్లు కేంద్రంలో బిజెపి అధికారంలోకి వస్తుందని చెప్పాయని, అవి అబద్దమని తేలాయన్నారు. 2009లో కూడా అన్ని సర్వేలు బిజెపియే అని చెప్పాయని గుర్తు చేశారు.

మన్మోహన్ ప్రభుత్వంపై కేవలం ఆరోపణలు మాత్రమే వచ్చాయని, అదే జగన్ పైన ఆరోపణలతో పాటు అక్రమార్జనకు నిదర్శనంగా ఆస్తులు కూడా కనిపిస్తున్నాయని, వాటిపై ఎన్డీటివి ఎందుకు రాయటం లేదని ప్రశ్నించారు. కాంగ్రెసును వ్యతిరేకించే పార్టీలన్నీ తమకు మిత్రులే అన్నట్లు బిజెపి వ్యవహరిస్తోందని, అలాగే కలిసి వ్యాపారం చేసేవారంతా మనవాళ్లే అన్నట్లు జాతీయ మీడియా చూస్తోందని విమర్శించారు. ఇటీవల ఉప ఎన్నికలలో జగన్ పార్టీ కేవలం సానుభూతి వల్లే గెలిచిందని, మళ్లీ పునరావృతం కావన్నారు. ఇందిర హత్య అనంతరం కాంగ్రెసు భారీ మెజార్టీతో గెలిచిన విషయాన్ని గుర్తు చేశారు.

English summary
Congress party senior leader V Hanumanth Rao lashed out at NDTV and YSR Congress party chief YS Jaganmohan Reddy for NDTV survey.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X