చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవి లాబీయింగ్?: టిటిడి మండలిలో వియ్యంకుడు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
చిత్తూరు: తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలక మండలి బుధవారం కొలువు తీరింది. రాత్రి గం.11.45 నిమిషాలకు ఆలయంలోని బంగారువాకిలిలో 45వ చైర్మన్‌గా కనుమూరి బాపిరాజు ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం బాపిరాజుతో ప్రమాణ స్వీకారం చేయించారు. బాపిరాజుతో పాటు పాలకమండలి సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.

సభ్యులుగా మంగళగిరి ఎమ్మెల్యే కాండ్రు కమల, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు రాజిరెడ్డి, రాజేశ్వరి దేవి, ఎల్ఆర్ శివ ప్రసాద్, సిహెచ్ లక్ష్మణ రావు, రేపాల శ్రీనివాస్, చిట్టూరి రవీంద్ర, జివి శ్రీనాథ్ రెడ్డిలు ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం సాయంత్రం గం.4.30నిమిషాలకు టిటిడి ఈవో సుబ్రహ్మణ్యం, ఈ నెల 31న ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఎన్.కన్నయ్య, ఎండోమెంట్ కమిషనర్ జి.బలరామయ్య ప్రమాణ స్వకారం చేయనున్నారు.

ప్రమాణ స్వీకారం సందర్భంగా చైర్మన్ కనుమూరి బాపిరాజు మాట్లాడుతూ... పాలకమండలిలో సభ్యులందరిని కలుపుకొని వెళతానని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. తాడు మూడున్నర దశాబ్దాలుగా రాజకీయాల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, మంత్రిని అయి చైర్మన్‌గా అయ్యానని, పదవి స్వీకరించాక ఆనందం కంటే బాధ్యత పెరిగినట్లుగా ఉందన్నారు.

కాగా టిటిడి పాలకమండలిలో ఉన్న శివ ప్రసాద్ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి వియ్యంకుడు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల సమయంలో చెన్నైలోని శివ ప్రసాద్ ఇంట్లో రూ.30 కోట్లు పట్టుబడ్డ విషయం తెలిసిందే. ఆ డబ్బులు చిరంజీవికి సంబంధించినవే అనే ప్రచారం జోరుగా జరిగింది. ఆ వ్యాఖ్యలను చిరంజీవి కొట్టి పారేశారు. అయితే ఇప్పుడు అదే శివ ప్రసాద్‌కు టిటిడి పాలకమండలిలో అవకాశం కల్పించేందుకు చిరంజీవి ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేసి ఉంటారనే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి.

English summary
Rajyasabha Member Chiranjeevi relative Siva Prasad get chance as a member in TTD palaka mandali. It is said that some are suspecting.. Chiranjeevi used his influence in Delhi for Siva Prasad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X