గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిన్న నిత్యానంద.. ఇప్పుడు అవినీతి: ఫ్లెక్సీ ఏర్పాటు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Guntur District
గుంటూరు: జిల్లాలో ఫ్లెక్సీల కలకలం కొనసాగుతోంది. ఇప్పటికే రాసలీలల స్వామి నిత్యానందకు, అవినీతికి వ్యతిరేకంగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులు, ఎమ్మార్, ఓఎంసి కేసులు దర్యాఫ్తు చేస్తున్న సిబిఐ జెడి లక్ష్మీ నారాయణకు అనుకూలంగా ఫ్లెక్సీలను గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి అవినీతిపై మూన్ సేన ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది.

అప్పుడు ఆహా ఆంధ్ర ప్రదేశ్.. ఇప్పుడు అయ్యయ్యో ఆంధ్ర ప్రదేశ్ అని ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అవినీతితో ఎపి గగ్గోలు పెడుతోందని, సాగునీటి కోసం రైతులు, తాగునీటి కోసం ప్రజలు, ఎమ్మార్పీ కోసం మందుబాబులు, విద్యుత్ కోసం మహిళలు, బెయిల్ కోసం అక్రమార్కులు.. ఇలా రాష్ట్రంలోని ప్రజలంతా గగ్గోలు పెడుతున్నారని మూన్ సేన ఆ ఫ్లెక్సీలో పేర్కొంది.

కాగా గతంలో పలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అవినీతికి, సినీ నటి రంజితతో రాసలీలల కేసులో ఇరుక్కున్న నిత్యానంద స్వామికి లింక్ పెట్టి ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడంతో అటు వైపు వెళ్లే వారి అందరి దృష్టిని అది అప్పుడు ఆకర్షించింది. నిత్యానంద స్వామికి, అవినీతికి లింక్ పెడుతూ గుంటూరులో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. దీనిని కూడా అప్పుడు ది మూన్ సేన పేరుతో దీనిని ఏర్పాటు చేశారు.

అందులో నిత్యానందకు వెటకారపు వ్యాఖ్యల ద్వారా స్వాగతం పలికారు. ఆయనకు వెటకారంగా స్వాగతం పలుకుతూనే రాష్ట్రంలోని అవినీతిపై కూడా ఎద్దేవా చేశారు. ఆ ప్లెక్సీలో.. తమిళనాడు, కర్నాటకలలో ఛీత్కారాలతో సతమతమవుతున్న నిత్యానంద స్వామికి సాదర స్వాగతం.. నేటి మా ఎపి అక్రమార్కులకు, అవినీతిపరులకు అండగా ఇక్కడి క్రింది స్థాయి న్యాయవ్యవస్థ వరకు జీతాలు తీసుకుంటున్న వారు అవినీతికి పాల్పడుతున్నారని అందులో పేర్కొన్నారు.

English summary
The Moon Sena arranged a flexi in Guntur district about Andhra Pradesh corruption after against to Nityananda Swamy and supporting CBI JD Laxmi Narayana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X