వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్ర మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ: సిఎంగా జైపాల్ రెడ్డి?

By Pratap
|
Google Oneindia TeluguNews

S Jaipal Reddy
న్యూఢిల్లీ: ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ తన మంత్రివర్గంలో భారీ మార్పులు, చేర్పులకు శ్రీకారం చుడుతున్నట్లు జాతీయ మీడియాలో గురువారం వార్తలు వచ్చాయి. సెప్టెంబర్ మధ్యలో ఈ పునర్వ్యస్థీకరణ ఉండవచ్చుననేది ఆ వార్తల సారాంశం. పునర్వ్యస్థీకరణలో భాగంగా పెట్రోలియం శాఖ మంత్రిగా జైపాల్ రెడ్డిని తప్పించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఆయనను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పంపించవచ్చునని వార్తలు గుప్పుమన్నాయి. ఎస్ఎం కృష్ణను కూడా కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పించి రాష్ట్రానికి పంపే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

జాతీయ మీడియాలో వచ్చిన వార్తాకథనాల ప్రకారం - పెట్రోలియం, విదేశీ వ్యవహారాలు, విద్యుచ్ఛక్తి, రోడ్లు - హైవేలు, సమాచార బ్రాడ్‌కాస్టింగ్ వంటి శాఖల విషయంలో మార్పులుంటాయని అంటున్నారు. అయితే, ఇంకా నిర్దిష్టంగా ఈ మేరకు నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు. 2014 సాధారణ ఎన్నికల్లో, కొన్ని రాష్ట్రాల్లో జరిగే శానససభ ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలను పెంచుకునే దిశగా కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని సమాచారం.

జైపాల్ రెడ్డి స్థానంలో గులాం నబీ ఆజాద్‌కు పెట్రోలియం శాఖను అప్పగిస్తారని సమాచారం. జైపాల్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పంపిస్తారని తెలుస్తోంది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రి వీరప్ప మొయిలీ తాత్కాలికంగా నిర్వహిస్తున్న విద్యుచ్ఛక్తి శాఖను కూడా ఆజాద్‌కు అప్పగించే అవకాశాలున్నాయి. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ఎం కృష్ణను కర్ణాటకకు పార్టీకి బదలాయించే సూచనలున్నాయి. వచ్చే ఏడాది మేలో కర్ణాటకలో ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ఈ మార్పు చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. వాణిజ్య, పరిశ్రమల మంత్రి ఆనందశర్మకు విదేశీ వ్యవహారాలను అప్పగించే అవకాశం ఉంది.

అంబికా సోనీని సమాచార, బ్రాడ్‌కాస్టింగ్ శాఖ నుంచి, సిపి జోషీని రోడ్ల శాఖ నుంచి మారుస్తారని చెబుతున్నారు. అంబికా సోనీని మంత్రివర్గంలో కొనసాగిస్తూ జోషీని రాష్ట్రానికి పంపే సూచనలున్నాయి. రాజస్థాన్‌లో వచ్చే ఏడాది చివరలో ఎన్నికలు జరుగుతాయి. దీంతో జోషీని ఆ రాష్ట్రానికి పంపిస్తున్నట్లు తెలుస్తోంది. జైరాం రమేష్ విద్యుచ్ఛక్తి శాఖ కోసం పోటీ పడుతున్నప్పటికీ ప్రధానికి ఆ శాఖను ఆయనకు అప్పగించేందుకు ఇష్టం లేదని చెబుతున్నారు.

English summary
According to National media report - Prime Minister Manmohan Singh is likely to carry out a major reshuffle of his cabinet in the second week of September, which could see heavyweights such as SM Krishna and Jaipal Reddy swap their portfolios for state-level positions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X