వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండు హెలికాప్టర్లు ఢీ: తొమ్మిది మంది మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gujarat
అహ్మదాబాద్: వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్లు ఒకదానితో ఒకటి ఢీకొన్న సంఘటన గుజరాత్ రాష్ట్రంలో గురువారం చోటు చేసుకుంది. గుజరాత్‌లోని జామ్ నగర్ సమీపంలో ఏయిర్ ఫోర్సుకు చెందిన రెండు హెలికాప్టర్లు ఢీకొనడంతో తొమ్మిది మంది మృతి చెందారు. మోక్ డ్రిల్ నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. మృతులంతా వైమానిక దళానికి చెందినవారే.

కాగా అంతకుముందు రోజు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఆసారం బాపు హెలికాప్టర్ ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. ఆయనతో పాటు మరో నలుగురికి బుధవారం ప్రాణాపాయం తప్పింది. గుజరాత్‌లోని గోధ్రాలో రెండు రోజుల పాటు సత్సంగ్‌లో ప్రవచనాలు వినిపించేందుకు ఒక చార్టర్డ్ హెలికాప్టర్‌లో ఆశారాం బాపు, ఆయన ప్రధాన శిష్యులు బయల్దేరారు.

గోధ్రాలోని సైన్స్ కళాశాలలో హెలికాప్టర్ దిగాల్సి ఉంది. అయితే, ల్యాండింగ్‌కు కొద్దిసేపటి ముందు అందులో సాంకేతిక లోపం తలెత్తింది. నియంత్రణ కోల్పోవడంతో.. కొంత ఎత్తు నుంచి కిందకు పడిపోయిందని పోలీసు అధికారులు తెలిపారు. కిందకు పడిన హెలికాప్టర్ ఒక పక్కకు పూర్తిగా ఒరిగిపోయి, మూడు ముక్కలైంది. దీంతో ముందు వైపున్న అద్దాలు పగలగొట్టి ఆశారాం బాపును, పైలట్‌ను బయటకు తీసుకురావాల్సి వచ్చింది.

వెనువెంటనే వారిని సమీపంలో ఉన్న ఆశ్రమ్ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో బాపుతో పాటు పైలట్‌కు స్వల్ప గాయాలైనట్లు తెలిసింది. అతడి తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. హెలికాప్టర్ కొద్ది ఎత్తులో నుంచి మాత్రమే హఠాత్తుగా కూలడంతో అందులో ఉన్న అయిగురు ప్రాణాలతో బయటపడ్డారు. హెలికాప్టర్ అద్దాలు పగులగొట్టి పైలట్, బాపులను వెలికి తీశారు.

English summary
Two Air Force helicopters crashed near Sarmat village in Jamnagar in Gujarat after a mid-air collision on Thursday. There have been no reports of casualties as yet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X