హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చర్లపల్లి జైళ్లో మళ్లీ భానుకిరణ్ హంగామా, వాగ్వాదం?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Bhanu Kiran
హైదరాబాద్: మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ జైలులో మరోసారి వీరంగం సృష్టించినట్లుగా వార్తలు వస్తున్నాయి. సూరి హత్య కేసులో అరెస్టైన భాను కిరణ్ చర్లపల్లి జైలులో ఉన్న విషయం తెలిసిందే. తనకు ఇష్టం వచ్చినట్లుగా ములాకత్‌లకు అనుమతి ఇవ్వడం లేదని డిప్యూటీ సూపరింటెండెంట్‌తో భాను శుక్రవారం వాగ్వాదానికి దిగినట్లుగా తెలుస్తోంది. భాను కిరణ్ హంగామా పోలీసులను ఇబ్బందులకు గురి చేస్తోంది.

కాగా మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ బుధవారం కూడా చర్లపల్లి జైలులో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. జైలులో వసతులు సరిగా లేవని జైలు సూపరింటెండెంట్‌తో వాగ్వాదానికి దిగాడు. సిబ్బందిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భాను కిరణ్ ఒక్కసారిగా హల్ చల్ సృష్టించడంతో జైలు సిబ్బంది అయోమయానికి గురయింది. భాను కిరణ్ గతంలోనూ జైలులో హంగామా సృష్టించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్‌ను పోలీసులు ఏప్రిల్‌లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గతంలో మే 4వ తేది వరకు భాను కిరణ్‌కు కోర్టు జ్యూడిషియల్ కస్టడీకి అప్పగించింది. దీంతో భానును పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. పొద్దునే ఆరుగంటలకే తనకు అన్ని పత్రికలు కావాలని జైలు సిబ్బందితో అతను వాదానికి దిగాయని అప్పుడు వార్తలు వచ్చాయి. దీంతో జైలు సిబ్బంది కొన్ని పత్రికలను సమకూర్చారు. భానును చూసేందుకు ఇతర బ్యారెక్స్‌లో ఉండే నేరగాళ్లు ఎగబడ్డారు.

సూరి చాలాకాలం చర్లపల్లి జైల్లో ఉన్న విషయం విదితమే. సూరితో కలిసి ఉన్న ఖైదీలు ఇప్పుడు భాను చుట్టూ చేరి ఆసక్తిగా మాట్లాడుకోవడం కనిపించిందని జైలు వర్గాలు అప్పుడు తెలిపాయి. ప్రస్తుతం చర్లపల్లి మానస విభాగంలో ఉన్న భానును ముందు చంచల్‌గూడ జైలుకు తీసుకెళ్లాలని పోలీసులు గతంలో భావించారు. కానీ ఇటీవలి కాలంలో చంచల్‌గూడ జైలులో విఐపి విచారణ ఖైదీల సంఖ్య పెరిగింది. పైగా రెండు ప్రధాన అంశాలను దృష్టిలో పెట్టుకుని చంచల్‌గూడ జైలుకు భానును తరలించలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి.

English summary
Accused in Maddelacheruvu Suri murder case, Bhanu Kiran was shifted Cherlapally jail, According to news reports - Bhanu Kiran created hangama in jail on friday also. He demanded for mulakaths.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X